ఒకే ఏడాదిలో ఇద్దరు సూపర్ స్టార్స్ మరణం.. ప్రముఖ జ్యోతిష్యుడి సంచలన ప్రకటన

సినిమా ఇండస్ట్రీలో జాతకాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. సినిమా ప్రారంభోత్సవ ముహుర్తాలైనా, సినిమా రిలీజ్ డేట్స్ అయినా ముహుర్తాలు చూసి వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. టీజర్లు, ట్రైలర్లు, అన్నింటికి జాతకాలు పరిశీలించి ముందడుగు వేస్తారు. అలాంటి ఇండస్ట్రీలో జ్యోతిష్యుల అభిప్రాయాలను బాగా నమ్ముతారు. అయితే అలాంటి బలహీనతలను ఎరగా వాడుకొని కొందరు జ్యోతిష్యులు బయటకు చెప్పలేని విషయాలు చెప్పి సంచలనాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌లో ప్రముఖ జ్యోతిష్యుడు సుశీల్ సంచలన రీతిలో తన ప్రిడిక్షన్‌ను వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..

సినీ పరిశ్రమలో వివాదాలు స‌ృష్టించిన వారిలో తెలుగులో వేణుస్వామి ఒకరనే విషయం తెలిసిందే. ఆయన సెలబ్రిటీల విడాలకులపై సంచలన రీతిలో తన జ్యోతిష్యాన్ని వెల్లడించి వివాదాల్లో చిక్కుకోవడమే కాకుండా కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్‌లో సుశీల్ అనే జ్యోతిష్యుడు సంచలన రీతిలో యూట్యూబ్‌లకు తన జాతకాల ద్వారా పాపులారిటీని సంపాదించాడు. ఇక తాజాగా సల్మాన్, షారుక్ గురించి ఆయన ఏం చెప్పారో మీరే చూడండి..

Astrologer Sushil predicts Salman Khan

సల్మాన్ ఖాన్‌కు 2025 సంవత్సరం కాకుండా 2026, 2027 సంవత్సరాలు కూడా కలిసి రావు. ఆయన ఫ్లాపులతో తన కెరీర్‌ను ముందుకు కొనసాగిస్తారు. ఈ మూడు సంవత్సరాలు ఆయనకు గడ్డు పరిస్థితే. సక్సెస్ కోసం కనీసం మూడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని సునో ఇండియా వెబ్ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్‌కు చెందిన ఓ జ్యోతిష్కుడు సుశీల్ వ్యక్తం చేశారు.

అయితే సల్మాన్ ఖాన్‌కు త్వరలోనే ఆరోగ్య పూర్తిగా క్షీణిస్తుంది. ఆయన భయంకరమైన వ్యాధి బారిన పడుతాడు. ఆయన ఆరోగ్యాన్ని అరుదైన వ్యాధి వెంటాడుతుంది. ఆ వ్యాధి ఏమిటి? అనేది ప్రస్తుతం నేను ఇక్కడ చెప్పలేను. అయితే ఎప్పుడైతే ఆయనకు భయంకరమైన వ్యాధి ఉందని వెల్లడవుతుందో అప్పుడే ఆయన మరణం కూడా సంభవిస్తుంది అని ఆ జ్యోతిష్కుడు వెల్లడించారు.

Astrologer Sushil predicts Shah Rukh Khan life

ఇదిలా ఉండగా, సదరు జ్యోతిష్కుడు ఇంకా ఓ అడుగు ముందేసి.. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ఇకే సంవత్సరంలో మరణిస్తారు. వాళ్లు తమ 67 ఏళ్ల 6 నెలల వయసులో మరణిస్తారు. ఒకే క్యాలెండర్ సంవత్సరంలో వారిద్దరి ఈ లోకం నుంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతారు అని జ్యోతిష్కుడు షాకింగ్ న్యూస్ వెల్లడించారు. ఇదంతా వారి జాతకం, గ్రహ స్థితిని బట్టి చెబుతున్నాను అని సుశీల్ పేర్కొన్నాడు.

అయితే సుశీల్ చెప్పిన జ్యోతిష్యంపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఇతడు ఎప్పుడు చెడ్డ వార్తలే చెబుతాడా? మంచి విషయాలు చెప్పడా? మరణం గురించి ఎవరు కూడా చెప్పలేరు. ఎవరి మరణం ఎప్పుడు సంభవిష్తుందో చెప్పడం కష్టం. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇంకా ఎక్కువ కాలం బతుకుతాడు. ఇతడి రీల్‌ను నేను సేవ్ చేసుకొంటాను. ఆ తర్వాత ఇతడి జ్యోతిష్యం ఎంత వరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఘాటుగా స్పందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X