Don't Miss!
- Sports DC vs SRH: అందుకే ఉనాద్కత్ను పక్కనపెట్టాం: ప్యాట్ కమిన్స్
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
కత్తి తిప్పడంలో ఆరితేరిపోయిన హీరోయిన్.. మాతృభూమి కోసం పోరాటం.. వైరలవుతోన్న పానిపట్ ట్రైలర్
బాహుబలి లాంటి భారీ బడ్జెట్ చిత్రం వచ్చాక.. అలాంటి నేపథ్యంతో మరిన్ని చిత్రాలు వస్తోన్న సంగతి తెలిసిందే. భారీ యుద్దాలు, కోటలు ఇలా సెట్లు వేస్తూ కాస్త ఎక్కువగానే ఖర్చుపెడుతున్నారు. బాలీవుడ్లో ఈ తరహా సినిమాలను తెరకెక్కించేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. పద్మావత్, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లాంటి చిత్రాలే ఇందుకు ఉదాహరణలు. తాజాగా పానిపట్ అనే మరో చారిత్రక నేపథ్యం ఉన్న మూవీ వచ్చేందుకు సిద్దమైంది.
చరిత్రలో పానిపట్ యుద్దాలకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. మొదటి పానిపట్ యుద్దంతో ఢిల్లీ సుల్తానుల కాలం చెల్లిపోయి మొఘలుల పాలన మొదలైంది. రెండో పానిపట్ యుద్దంతో మొఘలుల పాలన పాతుకుపోయింది. అయితే ఈ మూడో పానిపట్ యుద్దం మాత్రం మరాఠా సామ్రాజ్యానికి, అఫ్గాన్ రాజు అహ్మద్ షా అబ్దాలీ మధ్య జరిగింది. ఈ యుద్దంలో ఇరుపక్షాలకు భారీ నష్టం వాటిల్లిందని, ఎంతో మంది వీరమరణం పొందారని చరిత్రకారులు తెలుపుతున్నారు.
అయితే ఈ మూడో పానిపట్ యుద్ద నేపథ్యంలో తెరకెక్కిన పానిపట్ సినిమాను అశుతోష్ గోవారికర్ అద్భుతంగా రూపొందించినట్టు కనిపిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను కాసేపటికి క్రితమే విడుదల చేశారు. అంతకుముందు అర్జున్ కపూర్, కృతి సనన్, సంజయ్ దత్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
Presenting the #PanipatTrailer - The Battle That Changed History.
— Ashutosh Gowariker (@AshGowariker) November 5, 2019
Releasing Dec 6. https://t.co/knKMjAvQAu@duttsanjay @arjunk26 @kritisanon #SunitaGowariker @RohitShelatkar @Shibasishsarkar @agppl @visionworldfilm @RelianceEnt @ZeeMusicCompany
భర్తకు సుఖ దు:ఖాల్లో తోడుగా నిలిచే భార్యగా, రణరంగంలో శత్రువుల గుండెల్లో కత్తి దింపే వీరనారిగా కృతి సనన్ అద్భుతంగా నటించినట్టు కనిపిస్తోంది. మాతృభూమి కోసం ప్రాణాలు తీయడానికైనా, ఇవ్వడానికైనా సిద్దపడే యోధుడిగా అర్జున్ కపూర్, శత్రువుల రక్తాన్ని తానే రాక్షసుడిగా సంజయ్ దత్ చక్కగా నటించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 6న విడుదల కానుంది.