ఆ సినిమాను 26 సార్లు చూసిన వాజ్‌పేయి.. ఓ హీరోయిన్‌ చూసి తడబాటు!

By Rajababu

Recommended Video

Atal Bihari Vajpayee Likes Fine Arts Alot

దివంగత మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయ్ కేవలం రాజకీయవేత్తనే కాదు. మంచి కవి కూడా. సాహిత్యం, కళలు అంటే ఎంతో ఇష్టపడేవారని ఆయన సన్నిహితులు పలు సందర్భాల్లో వెల్లడించారు. వాజ్‌పేయ్‌కి భీమ్‌సేన్ జోషి, అంజద్ అలీఖాన్, హరిప్రసాద్ చౌరాసియా సంగీతంతోపాటు లతా మంగేష్కర్, ముఖేష్, రాహుల్ దేవ్ బర్మన్ (ఆర్డీ బర్మన్) పాటలను ఎక్కువగా వినేవారట. బాలీవుడ్ సినిమాలను అమితంగా ఇష్టపడేవారని తెలిసింది.

సీతా ఔర్ గీతా సినిమాను

సీతా ఔర్ గీతా సినిమాను

బాలీవుడ్ నటి హేమా మాలినికి వాజ్‌పేయ్ వీర ఫ్యాన్. 1972లో విడుదలైన హేమమాలిని నటించిన సీతా ఔర్ గీతా చిత్రం అంటే చాలా ఇష్టం. ఆ చిత్రాన్ని సుమారు 25 సార్లు చూశారట. ఈ విషయాన్ని ఎంపీ హేమా మాలిని స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

నన్ను చూసి తడబాటు

నన్ను చూసి తడబాటు

వాజ్‌పేయిని తొలిసారి కలిసినప్పుడు ఆయన నాతో మాట్లాడటానికి తటపటాయించారు. దాంతో నాకు కొంత సందేహం కలిగింది. పక్కనే ఉన్న ఓ వ్యక్తిని అడిగితే.. మీకు ఆయన వీరాభిమాని. మిమ్మల్ని మొదటిసారి కలిసినందున అభిమాన నటిని చూశానని తడబడి ఉండవచ్చని చెప్పారు అని హేమమాలిని వెల్లడించింది.

వాజ్‌పేయికి ఇష్టమైన చిత్రాలు

వాజ్‌పేయికి ఇష్టమైన చిత్రాలు

హేమమాలినితోపాటు అలనాటి నటులు సంజీవ్ కుమార్, సుచిత్రాసేన్ అంటే వాజ్‌పేయికి చాలా ఇష్టం. హిందీలో దేవదాస్, బంద్ని, తీస్రీ కసమ్, మౌసమ్, మమత, ఆంధీ చిత్రాలంటే ఆయనకు చాలా ఇష్టం. కేవలం హిందీ చిత్రాలే కాకుండా ఆంగ్ల చిత్రాలను కూడా ఎక్కువగా చూస్తుండేవారట. బ్రిడ్జ్ ఓవర్ ది రివర్ కవాయి, బార్న్ ఫ్రీ, గాంధీ చిత్రాలను మరీ మరీ చూశేవారట.

వాజ్‌పేయికి చాలా మంది ఫ్యాన్స్

వాజ్‌పేయికి చాలా మంది ఫ్యాన్స్

సాహిత్యపరంగా వాజ్‌పేయికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒకరు. వాజ్‌పేయి కవితలంటే కలాంకు చాలా ఇష్టం. వాజ్‌పేయి రాసిన ఊంచాయి కవితను కలామ్‌ను విపరీతంగా ఆకట్టుకొన్నది. ఆ కవితలో అద్భుతంగా వర్ణిస్తారు వాజ్‌పేయి. ఆ కవిత తన హృదయాన్ని తాకింది అని కలామ్ పలు సందర్భాల్లో వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X