twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Athiya Shetty: టీమిండియా క్రికెటర్ తో బాలీవుడ్ బ్యూటీ వివాహం.. పెళ్లి డేట్ ఫిక్స్!

    |

    టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి వార్తలపై గత కొంతకాలంగా అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అథియా షెట్టితో అతను డేటింగ్ చేస్తున్నాడు అని త్వరలోనే వీరు పెళ్లికూడా చేసుకోబోతున్నారు అని బాలీవుడ్ మీడియాలో అయితే చాలా రకాల వార్తలు వచ్చాయి. అయితే ఎప్పుడు కూడా ఆ విషయంలో ఈ జంట మాత్రం క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ అథియా శెట్టి మాత్రం రాహుల్ వెంట చాలాసార్లు విహారయాత్రలకు వెళ్లింది.

    అంతేకాకుండా వారు ప్రేమించుకుంటున్నట్లుగా ఆమె ఎన్నోసార్లు ఒక హింట్ అయితే ఇచ్చింది. అర్ధరాత్రులు కూడా వీరు లాంగ్ రైడ్స్ కు వెళ్లిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి అని బాలీవుడ్ మీడియాలో చాలాసార్లు వార్తలు వచ్చాయి. ఇక వాటిపై పెద్దగా ప్రస్తావించకుండా ఈ జంట మాత్రం వారి ప్రేమ యాత్రలను కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. ఇక మొత్తానికి పెద్దలు నిర్ణయం ప్రకారం ఈ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇరు కుటుంబాల సమక్షంలో ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

    Athiya Shetty marriage with team india cricketer KL Rahul date fix

    అథియా శెట్టితో ఈనెల 23న టీమిండియా క్రికెటర్ KL రాహుల్ వివాహం జరగనుంది. ముంబై ఖండాలాలో వీరి పెళ్లి వేడుకను 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు, పలువురు క్రికెటర్లు ఈ పెళ్లికి హాజరుకానున్నారని తెలుస్తోంది. కేఎల్ రాహుల్ ఇదివరకే కొంతమంది హీరోయిన్స్ తో కూడా ప్రేమలో ఉన్నట్లు చాలాసార్లు వార్తలు వచ్చాయి. అయితే రాహుల్ ఆ రూమర్స్ పై ఎప్పుడూ కూడా వివరణ ఇవ్వకుండా వాటిని ఎంజాయ్ చేస్తానని కూడా చాలా సరదాగా కామెంట్ చేసేవాడు. ఇక అథియా శెట్టి మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మరింత బిజీ కాబోతోంది అని అనుకుంటూ ఉండగా.. ఈ బ్యూటీ క్రికెటర్ రాహుల్ ప్రేమలో మాత్రం మునిగిపోయింది. ఇక మొత్తానికి వారి సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

    English summary
    Athiya Shetty marriage with team india cricketer KL Rahul date fix
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X