Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
క్రికెటర్ కేఎల్ రాహుల్ నా వాడు.. అఫైర్‌ను కన్ఫర్మ్ చేసిన కుర్ర హీరోయిన్
గత కొద్దికాలంగా అతియాశెట్టి, కేఎల్ రాహుల్ మధ్య అఫైర్ నడుస్తుందనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే కొన్నిసార్లు అతియా, రాహుల్ ఆ ప్రశ్నలకు, రూమర్లను దాటవేసే ప్రయత్నం చేశారు. తాజాగా రాహుల్‌తో ఉన్న రిలేషన్‌ను అతియా శెట్టి కన్ఫర్మ్ చేశారు. బర్త్ డే జరుపుకొంటున్న కేఎల్ రాహుల్‌కు తన మనసులోని మాటను చెప్పి తమ బంధాన్ని మరింత బలంగా మార్చారు. వివరాల్లోకి వెళితే..
కేఎల్ రాహుల్ బర్త్ డే రోజున
క్రికెటర్ రాహుల్ జన్మదినం ఏప్రిల్ 18. ప్రస్తుతం ఈయన స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. అయితే ఎంతో స్పెషల్ దినంగా భావించే బర్తే డో రోజున తన సన్నిహితులకు, స్నేహితులకు దూరంగా ఉంటూ జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. ఈ క్రమంలో తన ప్రియురాలు అతియాశెట్టి ఓ క్యూట్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
|
రాహుల్ నా మనిషి
క్రికెటర్ కేఎల్ రాహుల్ జన్మదినాన్ని పురస్కరించుకొని అతియా ఓ పోస్టు పెడుతూ.. హ్యాపీ బర్త్ డే.. మై పర్సన్ (నా మనిషి.. నా వాడికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఓ ఫోటోను షేర్ చేశారు. అతియా షేర్ చేయగానే ప్రియాంక చోప్రా, సానియా మిర్జా, మృణాల్ ఠాకూర్ లాంటి వాళ్లు కామెంట్లు చేస్తూ విషెస్ అందజేశారు.
రూమర్లకు తెర దించిన అతియా
గత ఫిబ్రవరి నుంచి అతియా, కేఎల్ రాహుల్ మధ్య రిలేషన్షిప్ నడుస్తున్నదనే గుసగుసలు వినిపించాయి. అయితే తాజా పోస్టుతో వారి మధ్య అఫైర్ ఎంత బలంగా ఉందోననే విషయం స్పష్టమైంది. ఒకే ఒక పోస్టుతో అతియాశెట్టి అన్ని ప్రశ్నలకు జవాబు అందించడమే కాకుండా రూమర్లకు తెర దించే ప్రయత్నం చేశారు.
కూతురు ప్రేమపై సునీల్ శెట్టి
అతియాశెట్టి గురించి ప్రస్తావిస్తే.. ప్రముఖ నటుడు సునీల్ శెట్టికి కుమార్తె. ఇటీవల తన కుమార్తెపై వస్తున్న రూమర్లపై సునీల్ స్పందిస్తూ.. నాకు అహాన్ గర్ల్‌ఫ్రెండ్ అంటే ఇష్టం, అలాగే అతియా ఇష్టపడే వ్యక్తి కూడా నచ్చుతాడు. వారి ప్రేమ విషయంలో నా భార్యకు ఎలాంటి సమస్య లేకపోతే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్లు సుఖంగా ఉంటే మాకు ఆనందమే అని అన్నారు.
Recommended Video
నిధి అగర్వాల్‌తో కేఎల్ రాహుల్ అఫైర్
కేఎల్ రాహుల్ విషయానికి వస్తే .. గతంలో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, ఆయనకు మధ్య అఫైర్ నడిసిందనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. అయితే కొంతకాలం డేటింగ్ చేసిన నిధి, రాహుల్ ఆ తర్వాత బ్రేకప్ చెప్పడం జరిగిందని, అనంతరం అతియాశెట్టితో ప్రేమయాణం మొదలుపెట్టారనే విషయం బయటకు వచ్చింది. తాజా వారిద్దరి అఫైర్‌కు అధికారికంగా గుర్తింపు లభించింది.