Adipurush: ప్రభాస్ కోసం అతుల్ సాహసం.. ఇండియాలోనే తొలిసారిగా!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రమే 'ఆదిపురుష్'. రామాయణం నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని రూపొందించారు.
దీనికితోడు ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలకు అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రంపై హైప్ క్రమంగా పెరుగుతూనే ఉంది. అందుకు అనుగుణంగానే దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఆదిపురుష్' మూవీని జూన్ 16న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలను వదులుతున్నారు. ఇక, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో వైభవంగా నిర్వహించబోతున్నారు.
దీన్ని జూన్ 6వ తేదీన తిరుపతిలో గ్రాండ్‌గా జరపబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలు అయ్యాయి. దీనికి కొన్ని వేల మంది అభిమానులు హాజరు అయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగానే సౌకర్యాలను కల్పిస్తున్నారు.
జూన్ 6వ తేదీన తిరుపతిలో గ్రాండ్‌గా జరగబోతున్న 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన అతుల్ ఎవరూ చేయని సాహసం చేస్తున్నారు. ఆయన ఏకంగా ముంబై నుంచి తిరుపతికి (దాదాపు 1230 కిలో మీటర్లు) రోడ్డు మార్గంలో బైక్ రైడ్ చేయబోతున్నారు.
ఇందుకోసం ఈ మ్యూజిక్ సెన్సేషన్ జూన్ మూడో తేదీనే తన రైడ్‌ను మొదలు పెట్టారు. ఇలా ఆరో తేదీ ఉదయానికి తిరుపతికి చేరుకోబోతున్నారు. ఆ వెంటనే శ్రీవారిని దర్శించుకుని.. నేరుగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు అవుతారు. దీంతో ఇండియాలోనే ఇలా చేసిన ఏకైక మ్యూజిక్ డైరెక్టర్‌గా అతుల్ నిలిచారు.
ఇదిలా ఉండగా.. 'ఆదిపురుష్' చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్తా హనుమంతుడిగా చేశారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మించారు. దీనికి అజయ్ - అతుల్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.


Click it and Unblock the Notifications











