‘సూపర్’ హీరోయిన్ గొప్ప మనసు..ఖరీదైన హోటల్ క్వారంటైన్ కేంద్రంగా..
కరోనా ధాటికి ప్రపంచమంతా వణికిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21 లక్షల మంది కరోనా బారిన పడగా.. దాదాపు లక్షకు పైగా ప్రాణాలను కోల్పోయారు. వీటిలోఅగ్రరాజ్యం అమెరికాలోని ఎక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. మన దేశంలోనూ రోజురోజుకూ పరిస్థితి దారుణంగా పడిపోతోంది. ఇప్పటికే 13 వేలకు పైగా కరోనా కేసులు బయటపడ్డాయి. నాలుగు వందల మంది దాకా మరణించారు.
కరోనా వైరస్ ఇంతలా విజృంభిస్తుండటంతో కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిపిందే. అయితే లాక్ డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు పరుస్తున్నా కరోనాను కట్టడి చేయలేకపోతోన్నారు. మన దేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. అక్కడి పరిస్థితులు మరి దిగజారిపోతోన్నట్టు కనిపిస్తోంది.

అయితే కరోనాపై పోరాటంలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు సెలెబ్రిటీలంతా అండగా నిలబడ్డారు. ఇప్పటికే తమ కార్యాలయాలను, హోటళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా వాడుకునేందుకు ఇచ్చేశారు.
షారుఖ్ తన క్యార్యాలయాన్ని, సోనూ సూద్ తన హోటల్‌ను ఇచ్చేయగా.. తాజాగా సూపర్ హీరోయిన్ అయేషా టకీయా కూడా తమ హోటల్ క్వారంటైన్ కేంద్రాలుగా వాడుకునేందుకు ఇచ్చేసింది. తన భర్తకు ఈ మేరకు కరోనాతో పోరాడేందుకు ముందుండి అందరినీ కాపాడుతున్న పోలీసుల కోసం హోటల్‌ను క్వారంటైన్ కేంద్రంగా వాడుకునేందుకు ఇస్తున్నామని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.


Click it and Unblock the Notifications











