Don't Miss!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
‘సూపర్’ హీరోయిన్‌కు వేధింపులు.... పట్టించుకోని పోలీసులు, భర్త ఆవేదన!
Recommended Video
నాగార్జున హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'సూపర్' మూవీ గుర్తుందా? అ చిత్రంలో హీరోయిన్గా నటించిన ఆయేషా టకియా తన అంద చందాలతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. చాలా రోజుల తర్వాత ఆయేషా టకియా పేరు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తన భార్యను ఓ వ్యక్తి వేధిస్తున్నాడని, చంపుతామని బెదిరించారని ఆయేషా భర్త పర్హాన్ అజ్మి ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యతో పాటు తల్లి, చెల్లిని కూడా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయం ముంబై పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ వరుస ట్వీట్లు చేశాడు.
|
డిసిపి దహియాకు ఫిర్యాదు చేసినా..
ఈ విషయం గురించి ముంబై 9వ జోన్ డిసిపి దహియాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అతడికి ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా ఎలాంటి రెస్పాన్స్ లేదని ట్వీట్ చేశారు. తమకు సహాయం చేయాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మంత్రి సుష్మా స్వరాజ్లను 'బేటీ బచావో' అంటూ పర్హాన్ వేడుకోవడం మీడియాలో చర్చనీయాంశం అయింది.
|
స్క్రీన్ షాట్లు పోస్ట్ చేసిన పర్హాన్
డిసిపి దహియాకు ఫోన్ ద్వారా సందేశం పంపినా పట్టించుకోవడం లేదని వెల్లడిస్తూ.... అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను పర్హాన్ అజ్మి ట్విట్టర్లో పోస్టు చేశాడు.
|
జాయింట్ సీపీ దేవేన్ భారతి ఎంట్రీ
పర్హాన్ అజ్మి వరుస ట్వీట్లు పెడుతుండటంతో ముంబై జాయింట్ సీపీ(లా & ఆర్డర్) దేవేన్ భారతి స్పందించారు. ఆయన ఆదేశంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు థాంక్స్ చెబుతూ పర్హాన్ ట్వీట్ చేశారు.
వేధింపులకు కారణం ఏమిటి?
ఫర్హాన్ అజ్మికి అతడి మాజీ వ్యాపార భాగస్వామి కషిఫ్ ఖాన్‌కు మధ్య వివాదం నడుస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పర్హాన్ అజ్మి కుటుంబ సభ్యులకు వేధింపులు మొదలైనట్లు తెలుస్తోంది.