twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలెంటెడ్ హీరోకు యునిసెఫ్ పిలుపు... పిల్లల హక్కులకు వెలుగు

    |

    బాలీవుడ్ లో టాలెంట్ కు, సక్సెస్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ ఎవరంటే ఠక్కున ఆయుష్మాన్ ఖురానా పేరే చెబుతారు ఎవరైనా. వరుస హిట్స్ తో స్టడీగా కొనసాగుతూ చిన్న బడ్జెట్ సినిమాల సూపర్ స్టార్ గా వెలుగుగొందుతున్న ఆయుష్మాన్ ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నాడు.
    యునిసెఫ్ తో చేతులు కలిపిన ఆయుష్మాన్ ఇకపై పిల్లల హక్కులను పరిక్షించేందుకు ప్రతిన పూనుకున్నాడు. చిన్నారులపై జరుగుతున్న హింసాకాండకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు యునిసెఫ్ తరఫున సెలబ్రిటీ అడ్వోకేట్ గా నియమితుడయ్యాడు. చిన్నారుల హక్కులపై తగిన అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ధ్యేయం.

    ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్ డేవిడ్ బెకమ్ తో కలసి పనిచేయనున్నాడు ఆయుష్మాన్. ఈ సందర్భంగా చిన్నారులు ఆనందంగానూ, ఆరోగ్యంగానూ, విద్యాధికులుగానూ ఎదిగేందుకు తగిన వాతావరణం కల్పించాలని, హింసకు దూరంగా వారిని పెంచాలని ఆయుష్మాన్ కోరాడు. సురక్షితమైన బాల్యమే తన ధ్యేయమని తెలిపాడు.

    Ayushman as UNICEF India celebrity advocate

    మరోవైపు యునిసెఫ్ భారత రాయబారి డాక్టర్ యాస్మిన్ అలీ హాఖ్ ఆయుష్మాన్ ను సాదరంగా తమ బృందంలోకి ఆహ్వానించారు. చేసే ప్రతి పాత్ర ద్వారా ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసే ఆయుష్మాన్ ఈ కార్యక్రమానికి తగిన గుర్తింపు తీసుకువస్తాడని, చిన్నారుల పట్ల హింస తగ్గించడంలో అతడు కీలకపాత్ర పోషిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

    English summary
    Ayushmann Khurrana's to join David Beckham for promoting rights ForEveryChild as The actor appointed as UNICEF India celebrity advocate for children's rights campaign.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X