twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ హీరో భార్యకు క్యాన్సర్.. మృత్యువును ఎదిరిస్తూ..

    |

    బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా సతీమణి తాహీరా కశ్యప్ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి ప్రాథమిక స్థాయిలో ఉందని వైద్యులు గుర్తించినట్టు తాహీరా తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం తనకు మాస్టెక్టోమి పద్ధతిలో చికిత్సనందిస్తున్నారనే పేర్కొన్నారు. దర్శకురాలిగా మారాలన్న కోరికతో ముందుకెళ్తున్న తరుణంలో క్యాన్సర్ వ్యాధికి గురవ్వడం కుటుంబ సభ్యులను విషాదానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే

     నా ఛాతిలో క్యాన్సర్ కణాలు

    నా ఛాతిలో క్యాన్సర్ కణాలు

    డక్టల్ కార్సినోమా ఇన్ సిటు అనే క్యాన్సర్ నాకు సోకింది. నా కుడి ఛాతిలో పెద్ద ఎత్తున క్యాన్సర్ కణాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ వ్యాధి ప్రాథమిక స్థాయిలోనే ఉంది. కాన్సర్ కణాలు ఛాతిలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి అని తాహీరా తెలిపారు.

     ఎంజెలీనా జోలీ మాదిరిగానే

    ఎంజెలీనా జోలీ మాదిరిగానే

    ఇప్పుడు నా పరిస్థితి హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలి మాదిరిగానే తయారయ్యే ప్రమాదం ఉంది. ఆమెకు కూడా క్యాన్సర్ సోకడంతో ఓ వక్షోజాన్ని తీసేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి సోకడం జీవితం గురించి తెలుసుకొనే ఓ పరమార్థం లభించింది అని తాహీరా అన్నారు.

    మానవ స్ఫూర్తిని మించిన

    మానవ స్ఫూర్తిని మించిన

    ఊహించని ఈ పరిణామం జీవితంలో చోటుచేసుకోవడం కష్టమే. అయినప్పటికీ దానిని ధైర్యంతో ఎదుర్కొంటాను. దేవుడికి ఉండే మనోధైర్యాన్ని నాలో పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మానవ స్ఫూర్తిని మించినది మరోకటి లేదు. ప్రతీ మహిళ ఈ పరిస్థితిని గ్రహించేలా చర్యలు తీసుకోవాలి అని తాహీరా పేర్కొన్నారు.

    త్వరలోనే దర్శకత్వం చేసే..

    త్వరలోనే దర్శకత్వం చేసే..

    తాహీరా, ఆయుష్మాన్ ఖురానా 2011లో వివాహం చేసుకొన్నారు. వీరికి ఆరేళ్ల విరాజ్‌వీర్, నాలుగేళ్ల విరుష్క సంతానం ఉన్నారు. తాహీరా రెండు షార్ట్ ఫిలింస్‌కు దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ రెండు షార్ట్ ఫిలింస్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. త్వరలోనే దర్శకత్వం చేపట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు.

    English summary
    Actor Ayushmann Khurrana's wife Tahira Kashyap revealed on Saturday that she was detected with pre-invasive breast cancer. Tahira posted on Instagram: "I was detected with DCIS (ductal carcinoma in situ) in my right breast with high grade malignant cells. Simply put stage 0 cancer/pre-cancerous stage, with cancer cells multiplying in a contained area."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X