twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను దారుణంగా అవమానించారు.. కరణ్ జోహర్ గుట్టు బయటపెట్టిన ఆయుష్మాన్!

    |

    'బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్‌లో కరణ్ జోహర్ తీరుపై నెటిజన్లు, సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. కేవలం స్టార్స్ పిల్లలనే ప్రోత్సహిస్తాడు. నెపోటిజం (బంధుప్రీతి ), తన వర్గం, తన సన్నిహితులకే ఆఫర్లు ఇస్తారనే విషయం ప్రస్తుతం దేశ సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. తాజాగా కరణ్ జోహర్ తీరును వివరించే ఆయుష్మాన్ ఖురానా ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయుష్మాన్ ‌ఖురానాకు ఎదురైన చేదు అనుభవం ఏమిటంటే..

    Recommended Video

    Nepotism In Bollywood : Ayushmann Khurrana Reveals His Experience With Karan Johar
    ఆయుష్మాన్ ఖురానా ఇంటర్వ్యూ వైరల్

    ఆయుష్మాన్ ఖురానా ఇంటర్వ్యూ వైరల్

    కరణ్ జోహర్‌కు సంబంధించిన ధర్మా ప్రొడక్షన్స్ వ్యవహరించిన తీరును గతంలో ఆయుష్మాన్ ఖురానా బయటపెట్టారు. తాను నటుడిగా నిలదొక్కుకునే రోజుల్లో ధర్మా ప్రొడక్షన్స్ ఆఫీస్‌తో ఎదురైన అనుభవాన్ని బయటపెట్టారు. అక్కడి వారు తాము స్టార్స్‌తో మాత్రమే సినిమాలు తీస్తాం. నీలాంటి వారికి అవకాశాలు ఇవ్వమని ముఖం మీదే చెప్పారనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అయుష్మాన్ ఖురానా చెప్పారు. అప్పుడు దానిని పెట్టించుకోలేదు కానీ.. తాజాగా ఆ ఇంటర్యూకు సంబంధించిన క్లిప్పింగ్ వైరల్ అవుతున్నది.

     కలువమని ఫోన్ నంబర్ ఇచ్చి

    కలువమని ఫోన్ నంబర్ ఇచ్చి

    ఆ ఇంటర్వ్యూలో కరణ్ జోహర్ తనను కలువమని స్వయంగా ఆఫీస్ ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆతర్వాత ఆ నంబర్‌కు నేను కాల్ చేస్తే కరణ్ జోహర్ లేరని చెప్పారు. మరుసటి రోజు ప్రయత్నిస్తే..ఆయన బిజీగా ఉన్నారని చెప్పారు. దాంతో నా ఆశలు ఆవిరి అయిపోయాయి. మళ్లీ ఫోన్ చేస్తే నీలాంటి వర్ధమాన నటులతో ధర్మ ప్రొడక్షన్ సినిమాలు తీయదు. కేవలం మంచి రేంజ్‌లో ఉన్న స్టార్స్‌తోనే సినిమాలు చేస్తామని చాలా దురుసుగా చెప్పారు అని ఆయుష్మాన్ ఖురానా చెప్పారు.

    వికీ డోనర్‌తో నా జీవితం..

    వికీ డోనర్‌తో నా జీవితం..

    అలాంటి పరిస్థితుల్లో నాకు షూజిత్ సర్కార్నాకు అవకాశం ఇచ్చారు. ఆయన తీసిన వికీ డోనర్ సినిమాతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. సినీ విమర్శకుల ప్రశంసలు పొందాను. ఆ సినిమాలో నేను పాడిన పాట పాని దా రంగ్‌తో గాయకుడిగా కూడా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత నాకు విభిన్నమైన చిత్రాల్లో నటించేందుకు ఆఫర్లు నా తలుపు తట్టాయి అంటూ ఆయుష్మాన్ చెప్పారు.

    గులాబో సితాబో మూవీతో

    గులాబో సితాబో మూవీతో

    ఆయుష్మాన్ ఖురానా నటించిన మరో చిత్రం అంధాదూన్‌కు మంచి విజయాన్నే కాకుండా అవార్డులను, పేరును సంపాదించిపెట్టాయి. ఆచిత్రానికి జాతీయ అవార్డు కూడా రావడం గమనార్హం. ఇటీవల అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన గులాబో సితాబో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి.

    English summary
    Ayushmann Khurrana has brought Karan Johar and Dharma Production's real face to young actors. Once Ayushmann his interview told that, Johar, who gave him a telephone number (his office number). According to the viral interview, when Ayushmann reached out to them, Dharma stalled him and eventually ended up telling him that they 'only work with stars and thus cannot work with him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X