హీరోయిన్‌తో లిప్‌లాక్.. హీరోను వదిలేసిన భార్య!
సాధారణంగా తెరపైన రొమాన్స్ సీన్లు హీరోలకు రియల్ లైఫ్‌లో చాలా కష్టాలు తెచ్చిపెడుతాయి. ముద్దులు, పడక గది సీన్లలో నటించాల్సి రావడం కొన్ని సందర్భాల్లో హీరోలకు కష్టంగా మారుతుంది. ఎందుకంటే వ్యక్తిగత జీవితంపై అలాంటి సీన్లు తీవ్ర ప్రభావం చూపుతాయి. అలాంటి సమస్యనే బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాకు ఎదురైంది. వివరాల్లోకి వెళితే..

వికీ డోనర్ సినిమాతో
సంచలన విజయం సాధించిన వికీ డోనర్ చిత్రంతో ఆయుష్మాన్ ఖురానా సినీ ప్రేక్షకులందరికీ చేరువయ్యాడు. ప్రస్తుతం ఆయన నటించిన బదాయి హో చిత్రం మంచి సక్సెస్‌ను ఇచ్చింది. ఈ సందర్బంగా రొమాంటిక్ సీన్ తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందనే విషయాన్ని ఆయన వెల్లడించారు.

యామీ గౌతమీతో లిప్‌లాక్
వికీ డోనర్ చిత్రంలో యామీ గౌతమీ నా పక్కన హీరోయిన్‌గా నటించింది. ఓ సీన్‌లో ఆమెతో లిప్ లాక్ చేయాల్సి వచ్చింది. ఆ సీన్ అద్భుతంగా ఆన్ స్క్రీన్‌పై కనిపించింది. ఆ సీన్ చూసి నా భార్య తహీరా కశ్యప్ అప్‌సెట్ అయింది. ఆ తర్వాత నన్ను వదిలేసి వెళ్లిపోయింది అని ఆయుష్మాన్ ఖురానా వెల్లడించారు.

ముద్దు సీన్లపై అభ్యంతరం
యామితో లిప్‌లాక్ సీన్ వల్ల మూడేళ్లు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను. మా దాంపత్య జీవితం చక్క పడటానికి చాలా సమయం పట్టింది. ప్రస్తుతం నా భార్యకు ముద్దు సీన్లపై అభ్యంతరం ఏమీ లేదు. ఇటీవల మన్మార్జియాన్ సినిమా షూటింగ్‌లో భూమి పడ్నేకర్‌తో లిప్‌లాక్ సీన్‌ను ప్రత్యక్షంగా చూసింది అని ఆయుష్మాన్ ఖురానా చెప్పారు.

వరుస హిట్లతో ఆయుష్మాన్
ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా కెరీర్ దూసుకెళ్తున్నది. ఆయన నటించిన చిత్రాలు అంధాధున్, బాదాయి హో సినిమాలు ఘనవిజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించాయి. గతంలో ఆయన నటించిన వికీ డోనర్ సినిమా చిన్నచిత్రంగా వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











