మగవాళ్ల ముద్దులా? ‘హోమో’ కంటెంట్‌ను భరించలేం.. బాలీవుడ్ మూవీపై నిషేధం!
వరుస విజయాలు, విభిన్నమైన కథా చిత్రాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా జర్నీకి బ్రేక్ పడింది. ఆయన నటించిన తాజా చిత్రం దుబాయ్, యూఏఈలో నిషేధాన్ని ఎదుర్కొంటున్నది. స్వలింగ సంపర్కం కథా నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్ర రిలీజ్‌ను రెండు దేశాలు అడ్డుకోవడం వివాదంగా మారింది. భారత్‌లోని గ్రామీణ ప్రాంతంలొోని ఇద్దరు యువకుల మధ్య ప్రేమ కథను శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో గజ్‌రాజ్ రావు, నీనా గుప్తా తదితరులు నటించారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

హోమో సెక్సువల్
విభిన్నమైన పాత్రలతో అలరిస్తున్న యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా నటించిన తాజా చిత్రం శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్. ఈ చిత్రం హోమో సెక్సువల్ కంటెంట్‌తో రూపొందింది. అయితే సనాతన ఆచారాలను పాటించే దుబాయ్, యూఏఈలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయకూడదని స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

సీన్లు కట్ చేస్తామని చెప్పినా..
శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ చిత్రంలోని కొన్ని అభ్యంతరకరమైన సీన్లు ఉండటంతో సినిమాపై సెన్సార్ విధించారు. చివరకు ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, మరో నటుడు జితేంద్ర మధ్య ముద్దు సీన్లను తొలగిస్తామని విన్నవించుకొన్నప్పటికీ.. అధికారులకు ఒప్పుకోలేదనే విషయం మీడియా కథనాల్లో వెలువడింది.

సినిమాను ప్రదర్శించం
దుబాయ్ రిపోర్టు ప్రకారం.. శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ చిత్రం విడుదలవుతుందా లేదా అనే విషయం అత్యంత సందిగ్ధంగా ఉండేది. కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇద్దరు యువకుల సంపర్కం (స్వలింగ సంపర్కం) ఆధారంగా కథ రూపొందింది. ఈ ప్రాంతంలో ఇలాంటి సినిమాలను ప్రదర్శించడానికి అనుమతించరు అని పేర్కొన్నారు.
Recommended Video


ముద్దు సీన్లు సమస్యే కాదు.. కానీ
శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్ చిత్రంలోని ముద్దులతోపాటు కొన్ని సన్నివేశాలను తొలగిస్తామని స్థానిక సెన్సార్ అధికారులకు హామీ ఇచ్చాం. కానీ ముద్దు సీన్లు అసలు సమస్యే కాదు. కానీ అందులో కంటెంట్‌పై మాత్రమే అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు.. అందుకే సినిమాపై దుబాయ్, యూఏఈలో నిషేధం విధించారు అని చిత్ర యూనిట్ తెలిపింది.


Click it and Unblock the Notifications











