ప్రభాస్, రానా, రాజమౌళి అంతా ఒక్క చోట చేరి రచ్చ.. ఆ రోజు ఫ్యాన్స్‌కు పండగే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దగ్గుబాటి రానా, దర్శక ధీరుడు రాజమౌళి వీళ్ళ గురించి పరిచయం అక్కర్లేదు. బాహుబలి రెండు భాగాలతో దేశవ్యాప్తమా క్రేజ్ సొంతం చేసుకున్నారు. బాహుబలిగా ప్రభాస్, భల్లాల దేవుడిగా రానా రూపాలు సినీ అభిమానుల మదిలో అలాగే ఉండిపోతాయి. బాహుబలి టీం మళ్లీ ఏకం కాబోతోందనే వార్తలు వస్తున్నాయి. కానీ ఈ సారి సినిమా కోసం కాదు. టివి షో కోసం. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షోకు రాజమౌళి, ప్రభాస్, రానా హాజరు కాబోతున్నారనేది లేటెస్ట్ న్యూస్.

కరణ్ జోహార్ వలనే
బాహుబలి రెండు భాగాలు హిందీలో అంత భారీ స్థాయిలో విడుదలయ్యాయి అంటే అది కరణ్ జోహార్ వలనే. తన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాహుబలి చిత్రాన్ని కరణ్ జోహార్ సమర్పించారు. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అప్పటి నుంచి కరణ్ జోహార్ కు, బాహుబలి టీంకు మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.

కాఫీ విత్ కరణ్
బుల్లితెరపై ఇటీవల పలు ఎంటర్‌టైనింగ్ షోలు పుట్టుకొస్తున్నాయి. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షో బాగా పాలుపర్ అయింది. ప్రముఖ సెలెబ్రిటీలంతా ఈ షోకు అతిథులుగా హాజరవుతున్నారు. ఇప్పటికే ఈ షో కోసం సైఫ్ అలీఖాన్, సారా అలీఖాన్, కాజోల్, అజయ్ దేవగన్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్స్ హాజరై సందడి చేశారు. త్వరలో బాహుబలి టీం కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

ఓకె చెప్పిన ప్రభాస్
ప్రభాస్ సాధారణంగా మీడియా ముందు పెద్దగా కనిపించడు. అలంటి ప్రభాస్ కూడా కరణ్ జోహార్ మీద ఉన్న గౌరవంతో ఈ షోకు హాజరయ్యేందుకు అంగీకరించాడట. రాజమౌళి, రానా కూడా అంగీకరించడంతో త్వరలో వీరి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో వీరు పాల్గొనే ఎపిసోడ్ ని షూట్ చేసి.. డిసెంబర్ నెలాఖరు కల్లా ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కరణ్ జోహార్ నిర్మాణంలో
ప్రభాస్ కరణ్ జోహార్ నిర్మాణంలో ఓ సినిమాలో నటించబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కానీ, కరణ్ కానీ ఈ వార్తలపై స్పందించలేదు. కానీ వీరి మధ్య ఆ అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. నేరుగా ఓ బాలీవుడ్ చిత్రంలో ప్రభాస్ ని నటింపజేయాలని కరణ్ జోహార్ ప్రయత్నిస్తున్నారు. ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాంచరణ్, ఎన్టీఆర్ ఈ భారీ మల్టీస్టారర్ లో నటిస్తున్నారు. రానా తన చిత్రాలతో తాను బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











