అమితాబ్ బచ్చన్, తాప్సీ ‘బద్లా’ ట్రైలర్.. సూపర్ థ్రిల్లింగ్
బాలీవుడ్ చిత్రం 'పింక్'లో కలిసి పని చేసిన అమితాబ్ బచ్చన్, తాప్సీ మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'బద్లా' పేరుతో రూపొందుతున్న ఈ థ్రిల్లర్‌కు సుజోయ్ గోష్ దర్శకత్వం వహిస్తుండగా, షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు.
'ప్రతి సారి రివేంజ్ తీర్చుకోవడం సరైంది కాదు.. ప్రతిసారి క్షమించి వదిలేయడం కూడా మంచిది కాదు' అనే డైలాగుతో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. రివేంజ్ తీర్చుకోవడానికి నిజాన్ని అన్వేషించే నైనా సేథి అనే అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

బాదల్ గుప్తా పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు. ట్రైలర్ చూస్తుంటే.. తాప్సికి సహాయ పడే పాత్రలో ఆయన నటించినట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల్లో మరింత సస్పెన్స్ రేకెత్తించేలా ట్రైలర్ డిజైన్ చేశారు. అమితాబ్, తాప్సీ పెర్ఫార్మెన్స్ థియేటర్లో ఉత్కంఠ రేకెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది.
స్పానిష్ సూపర్ హిట్ మూవీని హిందీలో 'బద్లా' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో మలయాళం యాక్టర్ టోనీ లుకె కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. బద్లా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











