ఓ వైపు 300 కోట్ల కలెక్షన్స్.. దురంధర్‌కు ఊహించని దెబ్బ.. రణ్‌వీర్ సింగ్ మూవీపై నిషేధం
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధార్ తెరకెక్కించిన చిత్రం దురంధర్. స్పై, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఏకంగా 7 రోజుల్లో 300 కోట్ల కలెక్షన్స్‌తో ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా మంచి ఊపులో ఉన్న సమయంలో చిత్ర యూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది. దురంధర్ మూవీపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం వెలువడింది. ఈ వివరాల్లోకి వెళితే..
జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా దురంధర్ చిత్రాన్ని నిర్మించారు. సారా అర్జున్ ఈ సినిమాలో రణ్‌వీర్‌కు హీరోయిన్‌గా నటించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్, క్రిస్టల్ డిసౌజా తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

దురంధర్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి దురందర్ సినిమాకు 280 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అయ్యింది. ఇక హైప్‌కి తగినట్లుగానే రణ్‌వీర్ సింగ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 168 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి.
దురంధర్ కలెక్షన్స్
దురంధర్‌కు తొలిరోజున 28 కోట్ల రూపాయలు, రెండో రోజున 32 కోట్ల రూపాయలు, మూడో రోజున 43 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 23.25 కోట్ల రూపాయలు, ఐదో రోజున 27 కోట్ల రూపాయలు, ఆరో రోజున 27 కోట్ల రూపాయలు, ఏడో రోజున 27 కోట్ల రూపాయలు రాబట్టింది. తొలి వారం ఇండియాలో ఏకంగా 207.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా 7 రోజుల్లో ఇండియా వైడ్‌గా 207.25 కోట్ల రూపాయల నికర కలెక్షన్స్ వసూలు చేయగా.. 248.75 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. అటు ఓవర్సీస్‌లోనూ ఏకంగా 65 కోట్ల రూపాయలు వసూలు చేసి 100 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తోంది. మొత్తంగా 7 రోజుల్లోనే దురంధర్ మూవీ వరల్డ్ వైడ్‌గా 313.75 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసింది. ఇలాంటి దశలో దురంధర్ మూవీకి ఊహించని షాక్ తగిలింది.
దురంధర్‌పై ఆ దేశాలు ఆగ్రహం
అంతర్జాతీయంగా రణ్‌వీర్ సింగ్ మూవీపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పలు సన్నివేశాలు ఉన్నాయని అరబ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే దురంధర్ చిత్రంపై ఈ 6 దేశాలు బ్యాన్ విధించాయి. దాంతో చిత్ర యూనిట్ ఉలిక్కిపడింది. భారతీయ చిత్రాలకు ప్రత్యేకించి బాలీవుడ్ సినిమాలకు గల్ఫ్ దేశాలలో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ స్థిరపడిన ప్రవాస భారతీయులతో పాటు అక్కడి స్థానికులు కూడా మన సినిమాలను ఆదరిస్తారు.
అనుమతి నిరాకరణ
గత కొన్నేళ్లుగా భారతదేశంతో సమానంగా గల్ఫ్ దేశాల్లోనూ మన సినిమాలు వసూళ్లు రాబడుతున్నాయి. దీనిలో భాగంగా దురంధర్ నిర్మాతలు కూడా గల్ఫ్ దేశాలలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నించారు. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా.. పలు చోట్ల పర్మిషన్ దొరకలేదు. మరికొన్ని చోట్ల మాత్రం పరిమితంగా థియేటర్స్‌ను కేటాయించారు. పాకిస్తాన్‌పై అనుచితమైన కంటెంట్ ఉందనే సాకుతోనే ఆయా దేశాలు దురంధర్‌పై బ్యాన్ విధించాయి. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో? ఎలా ఈ వివాదంలో నుంచి బయట పడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











