Ban Ramayana: రాముడి పాత్రలో గోమాంసం తినే యాక్టరా? ఆగ్రహంతో సద్గురు కామెంట్స్ ఏమిటంటే?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ కాంబినేషన్‌లో వస్తున్న పౌరాణిక చిత్రం రామాయణ. ఈ చిత్రంలో రవి దుబే, సాయి పల్లవి, సన్నీ డియోల్, యష్, అమితాబ్ బచ్చన్, లారా దత్తా, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, శోభన తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమా పాటలకు ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తుండగా, హ్యాన్స్ జిమ్మర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మానస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల చేశారు. అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది. ఈ సినిమాపై బాలీవుడ్ ప్రముఖులే ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో రాముడు పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రణ్‌బీర్ కపూర్‌పై ఆగ్రహానికి కారణమేమిటంటే?

అయితే గతంలో రణ్‌బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు మాంసం, పాయా అంటే ఇష్టం. నేను బీఫ్ (గోమాంసం) అంటే బాగా ఇష్టం. నేను బీఫ్ గయ్‌ను అంటూ చెప్పుకొన్నాడు. అయితే హిందూవులకు పవిత్రమైన గోవు చంపి దాని మాంసం తినే వ్యక్తిని రాముడిగా చూడగలమా? ఆ పాత్రకు ఆయన పవిత్రతను ఆశించగలమా? అంటూ నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.
రాముడి పాత్రను రణ్‌బీర్ కపూర్ పోషించడంపై సద్దురు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాముడు అంటే మర్యాద పురుషుడు. అలాంటి పాత్రను పోషించాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. రాముడిపై విశ్వాసం, భక్తి ఉండాలి. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు అనే నటుడు ఉండేవాడు. ఆయన రాముడు, కృష్ణుడు పాత్రలు పోషించడం ద్వారా ఆయనను దేవుడిగా కొలిచారు. ఆయన పార్టీ పెట్టిన సమయంలో రాముడు, కృష్ణుడు కటౌట్స్ పెట్టి అతడిని భారీ మెజారిటీతో గెలిపించారు అని సద్గురు చెప్పారు.
రాముడుగా నటిస్తున్నాడంటే.. అతడిలో జెంటిల్మన్ తనాన్ని ఇష్టపడాలి. అలాంటి లక్షణాలు లేకపోతే నేను హర్ట్ అవుతాను. నీ ముఖం రాముడిలా అనిపించాలి. నాకు నేను విజువలైజేషన్ చేసుకోవాలి. కేవలం నటుడిగా ఆయన రాముడు పాత్ర పోషిస్తే సరిపోదు. ఆదర్శ పురుషుడి క్వాలిటీస్ అతడిలో ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు ఇష్టపడుతారు. సినిమాలు యాక్టర్ల వల్ల నడువవు. ప్రేక్షకుల కారణంగా నడుస్తాయి. కాబట్టి ప్రేక్షకుల అంచనాలు, అభిరుచిని దృష్టిలో పెట్టుకొని నిర్మాత, దర్శకులు రాముడి పాత్రకు సరైన వ్యక్తిని ఎంపిక చేయాలి అని సద్గురు అన్నారు.
రామాయణం సినిమాపై బాలీవుడ్ ప్రముఖుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఈ సినిమాను బ్యాన్ చేయాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత రామాయణం సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ రాకపోగా దారుణంగా ట్రోలింగ్‌కు గురి కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.


Click it and Unblock the Notifications











