అమితాబ్ బచ్చన్‌కు లీగల్ నోటీసులు, ఆ డ్రెస్సు వేయడం వల్లే...
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లీగల్ నోటీసులు అందుకున్నారు. ఓ వ్యాపార ప్రకటనలో భాగంగా ఆయన న్యాయవాది గెటప్‌లో కనిపించడమే ఇందుకు కారణం. తమ అనుమతి లేకుండా వ్యాపార ప్రకటనలో న్యాయవాది గెటప్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఢిల్లీ బార్ కౌన్సిల్ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
సదరు వ్యాపార ప్రకటనను జారీ చేసిన కంపెనీపైనా బార్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆ ప్రకటన అన్ని మాధ్యమాల నుంచి తొలగించాలని కోరింది. ఇలాంటి ప్రకటన రూపొందించినందుకు ఢిల్లీ బార్ కౌన్సిల్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోని బార్ కౌన్సిల్స్‌కు పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది.

ఇకపై బార్ కౌన్సిల్ అనుమతి లేకుండా న్యాయవాది గెటప్స్ వ్యాపార ప్రకనల్లో వాడరాదని, లేనిచో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతానికి నోటీసులతో సరిపెట్టామని, ఇలాంటివి మళ్లీ పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అందులో పేర్కొన్నారు.
ఇటీవల అమితాబ్ బచ్చన్ ఓ మసాలా కంపెనీకి చెందిన యాడ్లో నటించారు. ఇందులో ఆయన న్యాయవాది గెటప్‌లో కనిపించారు. అమితాబ్ గతంలో నటించిన ఓ జ్యువెల్లరీ వ్యాపార ప్రకటనలు కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











