twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’ వెబ్ సిరీస్: షారుక్ ఖాన్ మీద పాకిస్థాన్ ఆర్మీ ఆగ్రహం

    |

    బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ నిర్మాతలుగా రూపొందిన వెబ్ సిరీస్ 'బార్డ్ ఆఫ్ బ్లడ్'. ఈ స్పై థ్రిల్లర్‌ సెప్టెంబర్ 27, 2019 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది. ప్రమోషన్లో భాగంగా షారుక్ ఖాన్ 'బార్డ్ ఆఫ్ బ్లడ్' ట్రైలర్ తన ట్విట్టర్ పేజీ ద్వారా షేర్ చేశారు.

    అయితే షారుక్ ఖాన్ ఈ ట్రైలర్ షేర్ చేసిన వెంటనే పాకిస్థాన్ ఆర్మీ నుంచి ఆయనక విమర్శలు ఎదురయ్యాయి. పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఈ ధారావాహికను నిర్మించిన షారుక్ ఖాన్‌పై ఫైర్ అయ్యారు. కశ్మీర్‌ విషయంలో జరుగుతున్న పరిణామాలకు వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా శాంతి, మానవత్వాన్ని ప్రోత్సహించాలని కోరారు. గఫూర్ పాకిస్తాన్ సాయుధ దళాల చీఫ్ స్పోక్ పర్సన్ అనే సంగతి తెలిసిందే.

    'బార్డ్ ఆఫ్ బ్లడ్' వెబ్ సిరీస్ బిలాల్ సిద్దిఖి రచించిన పుస్తకం ఆధారంగా అదే పేరుతో రూపొందించారు. ఈ ట్రైలర్ బలూచిస్తాన్ (పాకిస్తాన్లోని ఒక ప్రావిన్స్) లో ప్రారంభమవుతుంది, ఇక్కడ భారత గూఢచారులు అక్కడి ఉగ్రవాదుల చేతికి చిక్కుతారు. వారిని చంపి ఇండియాకు ఒక మేసేజ్ పంపాలనేది వారి ప్లాన్. మాజీ గూఢచారి కబీర్ ఆనంద్ (ఇమ్రాన్ హష్మి ), ఇషా (శోభితా ధూళిపాల), వీర్ (వినీత్ కుమార్ సింగ్) కలిసి రెస్క్యూ మిషన్ కోసం బలూచిస్తాన్ వెళ్ళమని పిఎంఓ నుంచి పిలుస్తుంది. బెలూచిస్తాన్ రెస్క్యూ-కమ్-సూసైడ్ మిషన్లో ఈ ముగ్గురు గూఢచారులు చేసిన ఉత్కంఠభరితమైన ప్రయాణం ఏమిటనేది ఈ వెబ్ సిరీస్‌లో ఆసక్తికరంగా చూపించబోతున్నారు.

    Bard of Blood Web Series: Pakistan Army Major outrage over Shahrukh Khan

    జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు ఆ రాష్ట్రాన్ని భారత్ ప్రభుత్వం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇండియాతో వాణిజ్య సంబంధాలను తెంచుకుంది. భారతీయ సినిమాలపై నిషేధం విధించింది. ఈ సమయంలో షారుక్ ఖాన్ మీద గపూర్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయింది.

    English summary
    'Bard of Blood' Web Series: Pakistan Army Major outrage over Shahrukh Khan. Pakistan Army Major General Asif Ghafoor slammed Shahrukh Khan for producing the series and asked him "to promote peace and humanity by speaking against atrocities in Kashmir."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X