రియాకు పెరుగుతున్న మద్దతు..నేను సైతం అంటోన్న బెబో....
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో వెలుగులోకి వచ్చిన డ్రగ్ రాకెట్ లో రియా చక్రవర్తి అరెస్ట్ అవ్వడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటే రియాకు క్రమంగా మద్దతు కూడా పెరుగుతోంది. ముఖ్యంగా నటీమణులు అందరూ ఆమెకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటీమణి కరీనా కపూర్ సైతం రియాకు తన మద్దతును తెలియజేసింది.
రియా అరెస్ట్ పై స్పందిస్తూ ఆమెకు న్యాయం జరగాలని సామాజిక మాధ్యమాల్లో పలుపురు నటీమణులు ఇప్పటికే ఓ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. విద్యాబాలన్, సోనమ్ కపూర్ వంటి తారామణులు రియాను బలిపశువును చేస్తున్న తీరుపై మండిపడ్డారు. చట్టం ఆమెను దోషిగా నిర్థారించకముందే ఆమెను అపరాధికా చిత్రీకరిస్తున్నారి దుయ్యబెట్టారు. తాజాగా ఈ లీగ్ లో జాయిన్ అయిన కరీనా సైతం అదే భావనను వ్యక్తం చేసింది.

రియా కేవలం డ్రగ్స్ కొనుగోలు చేసినందుకు మాత్రమే అరెస్ట్ అయిందని, ఆమె హంతకురాలు కాదని కరీనా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. దీంతో పాటే.. ఈ రియా విషయంలో వైరల్ గా మారిన కొటేషన్ను కూడా షేర్ చేసింది. మరోవైపు ఈ నటీమణులతో పాటూ పలువురు హీరోలు సైతం రియాకు మద్దతు తెలుపుతున్నారు. ఫర్హాన్ అక్తర్, ప్రతీక్ బబ్బర్ ఆమె తరఫున నిలబడగా, టాలీవుడ్ నుంచి లక్ష్మీ మంచు సైతం రియా పట్ల సానుభుతిని వ్యక్తం చేసింది. మరోవైపు రియా ధాఖలు చేసిన బెయిలు పిటీషన్ ను కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











