Divorce: ఐష్, అభిషేక్ విడాకుల వ్యవహారంలో ట్విస్ట్.. రంగంలోకి లెజెండరీ డైరెక్టర్?
సినీ పరిశ్రమకి చెందిన తారలు అనేకమంది బయట జీవితంలో కూడా కలిసి వుంటారని తెలిసిందే. అలా చాలా మంది స్టార్స్ డేటింగ్ లు బ్రేకప్స్ ఇలా చాలానే వ్యవహారం తర్వాత పెళ్లి వరకు చాలా తక్కువ మందే వెళతారు. కాగా ఇలా వెళ్ళాక కూడా అంతా కలిసే ఉంటారా అంటే అందుకు కూడా గ్యారెంటీ లేదు. మరి అలా పెళ్లి చేస్తున్న పలు స్టార్ జంటలలో బాలీవుడ్ సినిమా దగ్గర చాలా కాలం నుంచి హాట్ టాపిక్ గా వినిపిస్తున్న ప్రముఖ జంట అభిషేక్ బచ్చన్ మరియు ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ జంట కూడా ఒకటి.
కాగా ఇద్దరి కలయికలో చాలానే సినిమాలు వచ్చాయి. సినిమాలు.చేసాక తరవాత బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబానికి కోడలుగా ఐశ్వర్య రాయ్ కాస్తా ఐశ్వర్యా రాయ్ బచ్చన్ గా మారారు. అయితే ఇన్నేళ్ల వివాహ జీవితంలో ఇటీవల అసలు రచ్చ మొదలైంది. ఇండియా కుబేరుడు అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో అభిషేక్, ఐశ్వర్య నడుమ దూరం ఉందని ఒక క్లారిటీ చాలా మందికి వచ్చింది.

దీనితో అక్కడ నుంచే చాలా వార్తలు వీరి విడాకులు అంటూ కూడా వినిపించాయి. అలా వీరి కోసం ఏదొక వార్త ఏదొక కొత్త కోణం కనిపిస్తూనే వచ్చింది. అయితే ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వీరిపై వినిపిస్తుంది. విడిపోదాం అని అనుకున్న ఈ జంటను ప్రధాన పాత్రలుగా పెట్టి ఇండియాస్ టాప్ మోస్ట్ దర్శకుడు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు అంటూ క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి.
కాగా ఆ దర్శకుడు కూడా ఎవరో కాదు తమిళ దిగ్గజ దర్శకుడు మణిరత్నం అట. ఆల్రెడీ ఈ జంటతో మణిరత్నం రావన్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమా పెద్దగా రాణించలేదు కానీ ఇప్పటికీ మాత్రం దీనికి ఫాలోయింగ్ ఉంది. మరి మళ్లీ ఈ కాంబో రిపీట్ కావచ్చు అని ప్రస్తుతం వినిపిస్తున్న టాక్.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో కానీ ఒకవేళ నిజం అయితే మాత్రం ఇద్దరూ కలుస్తారు అనే మాట కూడా వినిపిస్తుంది. మణిరత్నంతో సినిమా అంటే ఎవరూ నో చెప్పరు. పైగా ఐశ్వర్యారాయ్ కి మణిరత్నం అంటే ఎంతో గౌరవం. ఇటీవల సినిమాలకి దూరం అయ్యిన ఐష్ కూడా కేవలం మణిరత్నం సినిమా అని తమిళ్ లో భారీ సినిమాలు పొన్నియిన్ సెల్వన్ చేసి పెట్టింది.
తనని ఎంతగానో ఆరాధించే ఐశ్వర్య రాయ్ మరో సినిమా అయినా తప్పకుండా చేస్తాను అని ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. అలాగే అభిషేక్ కూడా నో చెప్పే అవకాశాలు దాదాపు శూన్యం. సో ఈ కలయికలో సినిమా మరోసారి మణిరత్నం తీసుకొస్తారు అని వినిపిస్తున్న వార్తల్లో ఎంతవరకు ఉందో చూడాల్సిందే. ఇక ప్రస్తుతం మణిరత్నం నుంచి ఉలగనయగన్ కమల్ హాసన్ తో మూడు దశాబ్దాల తర్వాత "థగ్ లైఫ్" అనే భారీ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది వచ్చే ఏడాది జూన్ 5న విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











