twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Aryan Khan నే కాదు.. షారుక్‌ను నిర్బంధించిన సమీర్ వాంఖడే.. 10 ఏళ్ల క్రితం భారీ జరిమానా

    |

    డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌తో ముంబై ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. నిజాయితీ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకొన్న ఆయన ప్రస్తుతం ముడుపులు డిమాండ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్యన్ ఖాన్ విడుదలకు 8 కోట్లు తనకు, మొత్తంగా 25 కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలు మీడియాలో సంచలనం రేపాయి. అయితే ఆర్యన్ ఖాన్‌ అరెస్ట్‌కు ముందే షారుక్ ఖాన్‌ను ఎయిర్‌పోర్టులో నిర్బంధించారనే విషయం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. షారుక్ ఖాన్‌ను ఎందుకు నిర్బంధించారనే ఆరోపణల్లోకి వెళితే..

    10 ఏళ్ల క్రితం షారుక్‌ను సమీర్ అలా..

    10 ఏళ్ల క్రితం షారుక్‌ను సమీర్ అలా..

    పదేళ్ల క్రితం సమీర్ వాంఖడే కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖలో అధికారిగా ముంబై ఎయిర్‌పోర్టులో పనిచేశారు. ఆ సమయంలో విదేశాల నుంచి వచ్చిన షారుక్‌ను ఎయిర్‌పోర్టులో తనఖీలు చేశారు. విదేశాల నుంచి లెక్క చూపని ఖరీదైన వస్తువులు గురించి లెక్క చెప్పమని అడిగారు. అయితే షారుక్ వెంట తెచ్చుకొన్న విలాసవంతమైన వస్తువులను కస్టమ్స్ అధికారులకు చెప్పే జాబితాలో ఎందుకు చేర్చలేదని కొన్ని గంటలపాటు ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించారు అనే విషయం ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నది.

    షారుక్‌కు 1.5 లక్షల జరిమానా

    షారుక్‌కు 1.5 లక్షల జరిమానా

    షారుక్ ఖాన్ వెంట ఉన్న వస్తువులకు కస్టమ్స్ డ్యూటీ ఫీజు కట్టాలని సమీర్ ఖాన్ స్పష్టం చేశారట. అంతేకాకుండా ఆ వస్తువులను అక్రమంగా తీసుకొచ్చినందుకు భారీగా జరిమానా విధించారు. పదేళ్ల క్రితం సమారు 1.5 లక్షల కస్టమ్స్ డ్యూటిని షారుక్ చెల్లించేంత వరకు వదిలిపెట్టలేదనేది తాజా వార్త వెల్లడించింది.

    షారుక్ ఖాన్ కుటుంబంపై సమీర్ నిఘా

    షారుక్ ఖాన్ కుటుంబంపై సమీర్ నిఘా

    అప్పటి నుంచి షారుక్ ఖాన్‌పై, ఆయన కుటుంబంపై సమీర్ వాంఖడే దృష్టిపెట్టారనే విషయాన్ని ఎన్సీబీ అధికారులు అనధికారికంగా వెల్లడిస్తున్నారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ అక్టోబర్ 2వ తేదీ రాత్రి ముంబై నుంచి గోవా వెళ్లే క్రూయిజ్‌లో పక్కా ప్లాన్‌తో రైడ్ చేసి ఆర్యన్ ఖాన్‌తోపాటు ఏడుగురిని పట్టుకొన్నారు. ప్రస్తుతం అక్టోబర్ 3 తేదీ నుంచి ఆర్యన్ ఖాన్ ఆర్థర్ రోడ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్న విషయం తెలిసిందే.

     సమీర్ వాంఖడేపై వేటు

    సమీర్ వాంఖడేపై వేటు

    ఇదిలా ఉండగా, సమీర్ ఖాన్‌ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విభాగం సమీర్ వాంఖడేపై వేటు వేసింది. ఆర్యన్ ఖాన్ దర్యాప్తు నుంచి తప్పించినప్పటికీ.. ఆ దర్యాప్తుకు బయట నుంచి సహకరించేలా అధికారాన్ని ఇచ్చింది. 25 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలపై విచారణ పూర్తయ్యేంత వరకు ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తులో ప్రత్యక్షంగా పాల్గొనడానికి వీలు లేదని ఆంక్షలు విధించడం జరిగింది.

    Recommended Video

    Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
     అక్టోబర్ 28న ఆర్యన్ బెయిల్ పిటిషన్ విచారణ

    అక్టోబర్ 28న ఆర్యన్ బెయిల్ పిటిషన్ విచారణ

    ఇక ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణ బాంబే హైకోర్టులో ఎడతెరగని సీరియల్‌లో వాయిదాలు పడుతున్నది. వాస్తవానికి బెయిల్ పిటిషన్‌పై విచారణ బాంబే హైకోర్టులో జరుగాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆర్యన్ ఖాన్‌ బెయిల్ పిటిషన్ విచారణను అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు చేపట్టనున్నది. ఒకవేళ ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించకపోతే మరో 15 రోజులు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది

    English summary
    Shah Rukh Khan's son Aryan Khan Whatapp conversations with three other star kids apart from Ananya Panday. Aryan bail petition hearing stopped due to the commotion. Aryan Khan bail petition hearing postponed to October 28th. Apart from Aryan Khan arrest, Shah Rukh Khan detained 10 years ago by Sameer Wankhade
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X