తమిళ్ దర్శకుడిని మోసం చేసిన షారుక్ ఖాన్.. స్టార్ డైరెక్టర్ రాగానే సినిమా క్యాన్సిల్?

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నుంచి సినిమా వచ్చి చాలా కాలమవుతోంది. 2018 చివరలో జీరో సినిమాతో ప్రేక్షకులకు కనిపించిన కింగ్ ఖాన్ మళ్ళీ ఆ తరువాత మేకప్ వేసుకోలేదు. గత కొన్నేళ్లుగా వరుస అపజయాలు వెంటాడుతుండడంతో మంచి కథలను వెతికే పనిలో సతమతమవుతున్నాడు. బాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల దర్శకులతో కూడా కొత్త కథలపై చర్చలు చర్చలు జరిపాడు.

అసలైతే గత ఏడాది మొత్తం షారుక్ తమిళ్ దర్శకుడు అట్లీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆరు నెలల పాటు దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేయించిన షారుక్ చివరికి అతనికి హ్యాండ్ ఇచ్చాడు. అట్లీతో షారుక్ సినిమా చేయకపోవడానికి సరైన స్క్రిప్ట్ సెట్టవ్వలేదని కామెంట్స్ వచ్చాయి. నిజానికి షారుక్ సినిమా స్టార్ట్ చేయాలని అనుకున్న సమయంలో దర్శకుడిని మోసం చేసి సినిమాను క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Behind the reason for shahrukh khan Atlee project delay

ఎందుకంటే షారుక్ ఖాన్ వద్దకు మొన్నటి వరకు బాలీవుడ్ స్టార్ దర్శకులు ఎవరు కూడా కథలు చెప్పడానికి రాలేదు. అయితే ఫైనల్ గా బాక్సాఫీస్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని షారుక్ ని కలిసి కథ చెప్పడంతో వెంటనే ఒప్పేసుకున్నారట. త్రీ ఇడియట్స్, పీకే, సంజూ వంటి బాక్సాఫీస్ సినిమాలను రూపొందించిన రాజ్ కుమార్ హిరానితో సినిమా చేయాలని బాలీవుడ్ లో ప్రతి ఒక్కరు అనుకుంటారు.

ఇక ప్రస్తుతం షారుక్ ఉన్న పరిస్థితుల్లో అలాంటి దర్శకుడు ఆయన దగ్గరకు రావడం బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. అందుకే అట్లీ చెప్పిన కథను కావాలనే క్యాన్సిల్ చేశారట షారుక్. అవసరమైతే భవిష్యత్ లో మరో కథతో సినిమా చేద్దామని తమిళ్ దర్శకుడికి షారుక్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X