Priyanka Chopra: భర్త పేరు తొలగించడం వెనుక మరొక కారణం.. ప్రియాంక చోప్రా స్ట్రాంగ్ సెంటిమెంట్?
సినిమా ప్రపంచంలో సినీ తారల అలవాట్లు, తీసుకునే నిర్ణయాలు ఎల్లప్పుడూ హాట్ టాపిక్ గా నిలిస్తూ ఉంటాయి. వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటుంటుంది. ఇక ఇటీవల సమంత నాగ చైతన్య విషయం ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అదే తరహాలో మరి కొందరు టాప్ సెలబ్రిటీలు కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.
ఆ లిస్ట్ లో ప్రియాంక చోప్రా నిక్ జొనస్ కూడా ఉన్నట్లు అనేక రకాల వార్తలు వెలువడ్డాయి. ఇక అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ వచ్చేసింది. ఇక ప్రియాంక ఇటీవల సోషల్ మీడియాలో భర్త పేరును తొలగించడానికి గల కారణం కూడా ఇదేనని మరొక టాక్ అయితే వస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా క్రేజ్
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ప్రియాంక చోప్రా ఆ తరువాత బాలీవుడ్ లో కూడా పలు సినిమాలతో మంచి గుర్తింపు అందుకుంది. రెగ్యులర్ ఇంగ్లీష్ టీవీ సీరియల్స్ లో కూడా నటించిన ప్రియాంక చోప్రా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే అందుకుంది. ఇక ప్రియాంక చోప్రా టాప్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

పదేళ్లు చిన్న వాడితో ప్రేమ పెళ్లి
తన కంటే పదేళ్లు చిన్నవాడు అయినప్పటికీ కూడా ప్రియాంక చోప్రా హిందూ సాంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా అతనితో ఏడు అడుగులు వేసింది. అయితే వీరు విడాకులు తీసుకోబోతున్నట్లు గతంలోనే అనేక రకాల రూమర్స్ అయితే వచ్చాయి. ఇక ఆ వార్తల్లో డోస్ ఎంతో పెరుగుతున్నా కూడా ప్రియాంక మాత్రం పెద్దగా స్పందించలేదు.. తన భర్తతో ఎప్పటిలానే సంతోషంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా వారి ప్రేమకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు.

సమంత తరహాలో
రీసెంట్ గా సమంత నాగచైతన్య విడిపోయే ముందు కొన్ని కథనాలు రావడంతో అందరూ అబద్ధం అని అనుకున్నారు. కానీ సమంత మాత్రం పేరు మార్చడంతో చాలామందిలో అనుమానాలు మొదలయ్యాయి. సమంత అక్కినేని పేరు తీసేసి తన పాత పేరును సోషల్ మీడియాలో పెట్టుకోవడంతో నిజమాని అనుకున్నారు. ఇక ఇటీవల ప్రియాంక చోప్రా కూడా తన భర్త పేరునీ కూడా తీసేయడం తో వీళ్లు కూడా విడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అనేక రకాల రూమర్స్ అయితే వెలువడ్డాయి.

అసలు కారణం అదే..
అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని ఇదివరకే ప్రియాంక చోప్రా తల్లి కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. వారు ఇద్దరు కొత్త ఇంట్లోకి కూడా వెళ్లారు అంటూ అలాంటి వార్తలను ఎవరు కూడా నమ్మకూడదు అని కూడా ఆమె తెలియచేసింది. మరొక కారణం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. న్యూమరాలజీ రూట్లో ఆలోచించిన ఈ స్టార్ హీరోయిన్ తన పేరు పక్కన చోప్రా ఉంటే అంతగా కలిసి రాదట. జోనాస్ అనే పదాలు కలిసి రావని, వాటిని తీసేస్తేనే బెటర్ అని ఎవరో చెప్పారట. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం లైఫ్ బాగుంటుందని సలహాలు ఇవ్వడంతో ప్రియాంక భర్త పేరును తొలగించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











