సల్మాన్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. లాక్‌డౌన్ ముగిసిన వెంటనే సూపర్ గిఫ్ట్
అభిమానుల కోసం పరితపించే హీరోలలో సల్మాన్ ఖాన్ ఒకరనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి హీరోకు ఎప్పుడూ ఫ్యాన్స్ దగ్గరగా ఉండాలని కోరుకొంటారు. గత కొద్దికాలంగా అభిమానులను దగ్గర కావడం ఎలా అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో తన అభిమానుల కోసం సల్మాన్ ఓ శుభవార్తను అందించేందుకు సిద్ధమవుతున్నాడు. సామాజిక బాధ్యతను బలంగా నమ్మే సల్మాన్ తన అభిమానుల కోసం ఓ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించనున్నారు. ఆ యూట్యూబ్ ఛానెల్‌కు బీయింగ్ సల్మాన్ ఖాన్ అనే పేరును ఖరారు చేశారు.
లాక్‌డౌన్ ముగిసిన వెంటనే సల్మాన్ తన యూట్యూబ్ ఛానెల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ యూట్యూబ్ ద్వారా తన సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఆయన అభిమానులతో పంచుకొనే విధంగా చర్యలు తీసుకొంటున్నారు.

బీయింగ్ సల్మాన్ ఖాన్ యూట్యూబ్‌లో ఎప్పటికప్పుడు తాజా విషయాలను, తన సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు, టీజర్లను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి వార్త నిజంగా అభిమానులకు పండుగ లాంటిదే అనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.


Click it and Unblock the Notifications











