బెల్ బాటమ్ : అదరగొట్టిన అక్షయ్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుసగా సినిమాలు లైన్లో పెడుతున్నాడు. మిగతా హీరోలు ఏడాది ఒకటో, రెండో సినిమాలు చేస్తే గొప్ప అనుకుంటున్న ఈ రోజుల్లో అక్షయ్ తన దైన స్పీడుతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల 'హౌస్ ఫుల్ 4', 'గుడ్ న్యూస్' సినిమాలతో ప్రేక్షకులను అలరించిన అక్షయ్.. సూర్యవంశీ, లక్ష్మీబాంబ్, పృథ్వీరాజ్, బచ్చన్ పాండే, బెల్ బాటమ్' వంటి సినిమాలు చేస్తున్నాడు.
వీటిలో బెల్ బాటమ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు అక్షయ్. ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. ఇందులో అక్షయ్ రా ఏజెంట్‌గా కనిపించనున్నారు. రంజిత్ ఎం.తివారీ దర్శకత్వంలో వషు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్‌శిక్షా దేశ్‌ముఖ్, మోనిషా అద్వానీ, మధు బోజ్వానీ, నిఖిల్ అద్వానీ నిర్మించిన ఈ సినిమాలో వాణికపూర్ ,లారాదత్తా, హూమాఖురేషి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2, 2021లో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ టీజర్ ను విడుదల చేసిన అక్షయ్ రెట్రో లుక్ లో అదరగొట్టేశాడనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











