మేడ మీది నుంచి పడిపోయిన సీనియర్ నటుడు.. తీవ్రగాయాలు!
ప్రముఖ నటుడు చిన్మయ్ రాయ్ ప్రమాదానికి గురయ్యారు. బెంగాలీ చిత్రాలతో చిన్మయ్ రాయ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. కోల్ కతాలోని ఆయన నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ నాలుగో ఫ్లోర్ నుంచి ప్రమాదవశాత్తు పడిపోవడంతో చిన్మయ్ రాయ్ కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదం పట్ల చిన్మయ్ రాయ్ కుమారుడు శంఖ్య స్పందించారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను ఇంట్లో లేనని తెలిపారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు.

బెంగాలీ నటుడిగా పలు క్లాసికల్ చిత్రాల్లో చిన్మయ్ రాయ్ నటించారు బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా ఆసుపత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శిస్తున్నారు. 1970 నుంచి ఆయన చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











