Just In
- 5 min ago
రొమాన్స్‌లో మునిగితేలారు.. అది అలవాటుగా కాదట.. భర్త ఒళ్లో వాలిన పూజా రామచంద్రన్
- 15 min ago
అభిజీత్‌తో రిలేషన్‌పై దేత్తడి హారిక క్లారిటీ: అసలు నిజం అదేనంటూ రివీల్ చేసేసింది
- 49 min ago
బోయపాటికి మరో స్టార్ హీరో దొరికేశాడు.. ఒకేసారి రెండు భాషల్లో బిగ్ బడ్జెట్ మూవీ
- 1 hr ago
బాగా మిస్ అవుతోందట.. మళ్లీ దుబాయ్‌కి చెక్కేస్తోన్న కీర్తి సురేష్
Don't Miss!
- News
కడప జిల్లాలో దారుణం: ప్రేమ పేరుతో ఉన్మాదం: యువతిపై ఘాతుకం: ప్రాణాపాయ స్థితిలో
- Sports
టైగర్ పటౌడీని గుర్తుచేశాడు.. రహానేకే టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వాలి!! కోహ్లీ ఇక వద్దు!
- Finance
ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?
- Automobiles
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సిద్దమైన బాలీవుడ్ భాగమతి.. ట్రైలర్ తోనే అర్ధమయ్యింది, అనుష్క ముందు తేలిపోయిందని
బాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు కథలకు డిమాండ్ ఏ రేంజ్ లో పెరుగుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అక్కడి సీనియర్ దర్శకులు హీరోలు కూడా సక్సెస్ లేనప్పుడు హిట్టు ఫార్ములాగా తెలుగు కథలను రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక నిర్మాతలకు నచ్చితే కథ ఒరిజినల్ దర్శకులతోనే రీమేక్ చేయిస్తూ ఉంటారు. ఇక ఫైనల్ గా భాగమతి కథ కూడా బాలీవుడ్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి దుర్గమతిగా రాబోతోంది. రీసెంట్ గా ట్రైలర్ ని కూడా విడుదల చేశారు.

బాక్సాఫీస్ హిట్టుగా నిలిచిన భాగమతి
బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అనంతరం అనుష్క నటించిన సినిమా భాగమతి. ఎన్నో రీ షూట్స్ తరువాత 2018లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ట్రైలర్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక కరెక్ట్ టైమ్ లో రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. తమిళ్ లో కూడా సినిమా మంచి కలెక్షన్స్ ని అందుకుంది.

అదే దర్శకుడితో హాట్ హీరోయిన్
ఇక హిందీలో కొంతమంది అగ్ర హీరోయిన్స్ ఈ కథను రీమేక్ చేయాలని అనుకున్నారు కానీ ఎందుకో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కథ ఒప్పుకున్న తరువాత క్యాన్సిల్ చేశారు. ఇక బాలీవుడ్ లో గత మూడేళ్ళుగా డిఫరెంట్ పాత్రలో ఆడియెన్స్ బాగా దగ్గరైన హాట్ బ్యూటీ భూమి భూమి పడ్నేకర్ సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఇక భాగమతి దర్శకుడు అశోక్ కుమార్ ఈ దుర్గమతికి దర్శకత్వం వహించాడు.

ఎలాంటి మార్పులు లేకుండా
విక్రమ్ మల్హోత్రాతో కలిసి అక్షయ్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఇక డైరెక్ట్ గా డిసెంబర్ 11న అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. చూస్తుంటే సినిమాలో పెద్దగా మార్పులు చేయలేదని అర్ధమవుతోంది. ఇక అనుష్క రేంజ్ లో అయితే భూమి పడ్నేకర్ ఆకట్టుకోలేదనే కామెంట్స్ వస్తున్నాయి.

అనుష్క ముందు తేలిపోయింది..
సాధారణంగా తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేస్తే బాలీవుడ్ టెక్నీషియన్స్ భారీ మార్పులు చేయడం కామన్. వర్షం, కిక్, రెడీ సినిమాలు ఒరిజినల్ స్క్రీన్ ప్లేకు భిన్నంగా ఉంటాయి. ఇక అప్పుడప్పుడు ఉన్నది ఉన్నట్లు తీస్తే చాలని కొంతమంది నిర్మాతల అభిప్రాయం. అందుకే భాగమతి సినిమాను రిస్క్ లేకుండా హిందీలో కూడా పాత్రలను మార్చేసి ఒరిజినల్ గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కానీ హీరోయిన్ మాత్రం అనుష్క రేంజ్ లో ఆకట్టుకోలేదని ట్రైలర్ తోనే అర్ధమైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా హిందీ ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.