బుల్లితెరపై సల్మాన్ ఖాన్ నిజజీవితం
లాక్ డౌన్ లోనూ విపరీతంగా పనిచేస్తూనే ఉన్న సూపర్ స్టార్ ఎవరా అంటే బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ పేరే చెప్పాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రేక్షకులను అలరించడమే ఈ సూపర్ స్టార్ కు తెలుసు అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే రెండు వీడియో సాంగ్స్ ను రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్, ఇటీవలే తన స్కిన్ కేర్ ప్రాడక్ట్ ను కూడా లాంచ్ చేశాడు. ఇప్పుడు మరో రేంజ్ లో జనాలను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు సల్లూమియా.
క్వారంటైన్ లో సల్మాన్ జీవితం ఎలా గడుపుతున్నాడు అన్న కాన్సెప్ట్ తో రూపొందిన రియాలిటీ షో బాయ్ జాన్స్ త్వరలోనే ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవ్వబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ సల్మాన్ పాన్వెల్ ఫార్మ్ హౌస్ లో జరుగుతోంది. ప్రముఖ మొడల్ వాలుషా డిసౌజా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతోంది. ఆ ఫార్మ్ హౌస్ లో పనిచేస్తున్న వారు కూడా ఈ షోలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

మరోవైపు సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సినిమా దబాంగ్ నేపథ్యంలో ఓ యానిమేషన్ సిరీస్ కూడా త్వరలోనే ఓ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పై సందడి చేయబోతోందని తెలుస్తోంది. రెండు సీజన్లుగా రూపొందిన ఈ యానిమేషన్ సిరీస్ లో మొదటి దానిలోనే సుమారు 52 ఎపిసోడ్ లు ఉన్నాయని తెలుస్తోంది. ఏమైనా క్వారెంటైన్ లోనూ సూపర్ బిజీగా గడిపేస్తూ, రెండు చేతులా సంపాదించడం ఎలానో సల్మాన్ ను చూసే నేర్చుకోవాలి.


Click it and Unblock the Notifications











