»   » రూ. 29 కోట్లు, 159 సైనిక కుటుంబాలకు సాయం: అక్షయ్ కుమార్

రూ. 29 కోట్లు, 159 సైనిక కుటుంబాలకు సాయం: అక్షయ్ కుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేశం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన సైనిక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గతేడాది ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. భారత్‌ కే వీర్‌ పేరుతో వెబ్‌సైట్‌, యాప్‌ను ప్రారంభించారు. వీటి ద్వారా దేశంలో ఎవరైనా సహాయం అందించే వీలు కల్పించారు.

భారత్‌ కే వీర్‌ ప్రారంభించి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు రూ.29 కోట్ల విరాళం సేకరించడం జరిగింది, ఆ డబ్బును 159 సైనిక కుటుంబాలకు అందజేయడం జరిగిందని తెలిపారు.

నా డ్రీమ్ నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆదరణను ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అని అక్షయ్ కుమార్ తన ట్వీట్లో పేర్కొన్నారు. సహాయం అందించాలనుకునే వారు www.bharatkeveer.gov.in సంప్రదించాలని ఆయన సూచించారు.

భారత్‌ కే వీర్ వెబ్ సైట్ ప్రారంభించి తన అభిమానులను ప్రోత్సహించడం మాత్రమే కాదు, తనవంతుగా ఆర్థిక సహాయం అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అక్షయ్.

English summary
"BharatKeVeer completes a year...a dream which is now a growing reality and it gives me immense happiness to share Rs. 29 crores has been raised till now which has supported 159 families of our bravehearts. Keep showing your gratitude http://www.bharatkeveer.gov.in " Akshay Kumar tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X