twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిషేధం తర్వాత ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు చేస్తూ ఇండో-పాక్ బోర్డర్లో సింగర్ హల్ చల్!

    |

    బాలీవుడ్ సింగర్ మికా సింగ్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసిన వీడియో హాట్ టాపిక్ అయింది. ఇండియా-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతమైన అట్టారి బోర్డర్ చేరుకున్న ఈ వివాదాస్పదన సింగర్ 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    మికా సింగ్ ఆగస్టు 8న పాకిస్థాన్లోని కరాచీలో ఓ పెళ్లి వేడుకలో పెర్ఫార్మెన్స్ ఇచ్చినందుకుగాను అతడిపై ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్(ఏఐసిడబ్ల్యుఏ), ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్(ఎఫ్‌డబ్ల్యుఐసిఇ) నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

    Bharat Mata ki Jai: Singer Mika Singh at Attari border


    మికా సింగ్‌తో ఇండియాలోని ఏ సినీ నిర్మాణ సంస్థలు, మ్యూజిక్ కంపెనీలు పని చేయకూడదని, అలా చేస్తే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ సంస్థలు ఓ సర్వ్కులర్ జారీ చేశారు. కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని నిరసిస్తూ పాకిస్థాన్... ఇండియన్ సినిమాలపై నిషేధం విధించడంతో పాటు వాణిజ్య సంబంధాలు కూడా తెంచుకుంది. ఇవేవీ పట్టించుకోకుండా మికా సింగ్ పాకిస్థాన్ వెళ్లి ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బంధువు పెళ్లి వేడుకలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంపై ఏఐసిడబ్ల్యుఏ, ఎఫ్‌డబ్ల్యుఐసిఇ ఆగ్రహంగా ఉన్నాయి.

    పాకిస్థాన్లో ప్రదర్శన తర్వాత తనపై ఇండియా వ్యాప్తంగా నెగెటివ్ ఇంప్రెషన్ పడిన నేపథ్యంలో మికా సింగ్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అట్టారీ బోర్డర్ చేరుకున్నారు. జవాన్లకు సెల్యూట్ చేశారు. సైనికులు ఎన్నో త్యాగాలు చేసి మన కోసం బోర్డర్లో పని చేస్తున్నారని, వారి త్యాగాలు మరువలేనివి అన్నారు.

    English summary
    "Bharat Mata ki Jai! Thank you everyone for such a warm welcome. Happy Independence Day once again and salute to our jawans. They aren’t able to celebrate any festival, all to make our lives better. Jai hind." Mika Singh shared a video.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X