పూజా భట్ కు తలంటుపోసిన కంగన టీమ్... ఫ్రీగా పనిచేయించుకోడం గొప్పకాదని వ్యాఖ్య

ముట్టుకుంటే చాలు భగ్గుమనే ఫైర్ బ్రాండ్ కంగనతో పెట్టుకోవం అంత శ్రేయస్కారం కాదని బాలీవుడ్ లో ఇప్పటికే చాలా మందికి అనుభవ పూర్వకంగా తెలిసివచ్చింది. ఇండస్ట్రీలో సున్నితమైన విషయాలపై స్పందించే తెగువ ఉన్న వనితగా పేరగాంచిన ఈ హాట్ బ్యూటీ.. సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణాన్ని సీరియస్ గానే తీసుకుంది. ఇప్పటికే నెపోటిజం పై రగిలిపోతున్న కంగనకు ఇది మరింత ఆజ్యం పోసింది. తాజాగా ఈ వేడిమి ప్రముఖ దర్శకనిర్మాత మహేశ్ భట్ కూతురు పూజా భట్ కు తాకింది.

సుశాంత్ మరణంలో భట్ కుటుంబ హస్తం ఉందన్న అనుమానాలు రోజు రోజుకూ బలపడుతున్న నేపథ్యంలో, కంగన పోస్టులపై పూజ భట్ స్పందించింది. 'నీకు ఇండస్ట్రీలో అవకాశం ఎలా వచ్చిందో ఓ సార గుర్తు చేసుకో కంగనా' అంటూ పూజ ట్వీట్ చేసేసరికి, కంగన అగ్గిమీద గుగ్గిలమే అయింది. ఇక అమ్మడి టీమ్ నుంచి ట్వీట్ల వర్షం మొదలైంది.

Bhatts get a befitting reply from Kangana Again

కంగనకు అవకాశం ఇచ్చామని డప్పులు కొట్టుకోవడం మానండి అంటూనే ఉచితంగా ప్రతిభావంతుల శ్రమను దోచుకోవడం ఇలాంటి స్టూడియోలు పెట్టింది పేరు అంటూ మొదలుపెట్టిన కంగన టీమ్, గ్యాంగ్ స్టర్ సినిమాతో పాటే కంగనకు పోకిరి సినిమా అవకాశం కూడా వచ్చిందని గుర్తుచేసింది. ఇక ఒక అవకాశం ఇచ్చినంత మాత్రాన్ని షూటింగ్ సమయంలో ఆమెపై చెప్పులు విసిరే అధికారాన్ని ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించింది.

ఇక కంగనను టార్గెట్ చేసే ముందు సుశాంత్ సింగ్, రియా కపూర్ ల విషయంలో తన తన తండ్రి మహేశ్ భట్ ఎందుకు తలదూర్చాల్సి వచ్చిందో కనుక్కోమంటుూ పూజా భట్ కు గట్టిగానే తలంటుపోసింది కంగన టీమ్. ఏమైనా కంగనతో పెట్టుకోవడం అంత వీజీ కాదని జనాలకు మరోసారి అర్థమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X