రోడ్డు ప్రమాదంలో నటి మనీషా రాయ్ దుర్మరణం
భోజ్‌పురి నటి మనీషా రాయ్(45) రోడ్డు ప్రమాదంలో దర్మరణం పాలయ్యారు. షూటింగులో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వెనక నుండి వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
బస్ది నుండి మనియార్ వెళ్లే రహదారిపై మనియార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చితౌనీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. చనిపోయింది సినిమా యాక్టర్ అని తెలియడంతో భారీ సంఖ్యలో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు.

ప్రమాదం జరిగిన అనంతరం కారు డ్రైవర్ పారిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ గంగూలీ వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.
సమీప ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండటంతో తన అసోసియేట్ సంజీవ్ మిశ్రాతో కలిసి మనీషా రాయ్ బయల్దేరిందని, ఈ ప్రమాదంలో సంజీవ్ మిశ్రా గాయాలతో బయటపడ్డట్లు పోలీసులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications