నాకు లవ్ స్టోరీలు లేవు కానీ లస్ట్ స్టోరీలు ఉన్నాయి.. అందుకే నా జీవితంలోకి మగాడు రాలేదు!
Recommended Video

బాలీవుడ్ నయా సంచలనం భూమి పడ్నేకర్ విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ మంచి గుర్తింపు దక్కేలా ప్లాన్ చేసుకుంటోంది. 2015 లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నటించనుంది మూడు నాలుగు సినిమాల్లోనే అయినా మంచినటిగా ఆమెని అంతా కీర్తిస్తున్నారు. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ్ మంగళ్ సావధాన్ వంటి చిత్రాలలో మంచి నటన కనబరిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భూమి పెడ్నేకర్ తన వ్యక్తిగత విషయాలని ప్రస్తావించింది.

పనితోనే నా పెళ్లి
అనిత ష్రాఫ్ నిర్వహించే చాట్ షోలో భూమి పడ్నేకర్ పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో భూమి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నా ధ్యాస మొత్తం పనిమీదే ఉంటుంది. ప్రస్తుతానికి నా పెళ్లి వర్క్ తోనే అని భూమి తెలిపింది.

వ్యక్తి గత వ్యవహారాలు
సినిమాల్లో బిజీగా గడుపుతూనే పెళ్లి, ప్రేమ వంటి వ్యక్తి గత వ్యవహారాలు సాగించే నటులు చాలా మందే ఉన్నారు. కానీ నేను అలా చేయలేనని భూమి తెలిపింది. నాకు ప్రేమలో పడడానికి, పెళ్లి చేసుకోవడానికి సమయం దొరకడం లేదు. అంతేకాని ఎవరిని ప్రేమించకూడదనే ఉద్దేశం లేదని భూమి తెలిపింది.

ప్రేమలేదు కానీ
నా జీవితంలో ఇంత వరకు ప్రేమ అనేది లేదు. కానీ కొంటె కథలు చాలానే ఉన్నాయంటూ సరదాగా వ్యాఖ్యానించింది. అలాగే భూమి లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అమ్మ చెప్పినా కూడా
ఎవరినైనా పెళ్లి చేసుకోమని, ప్రేమించమని మా అమ్మే నాతో చెబుతుంది. ఎవరితో అయినా ట్రావెల్ చేయాలని నాకు అనిపిస్తుంది. అదే సమయంలో వర్క్ తో బిజీ. అందుకే నా జీవితంలోకి ఇంకా మగాడు రాలేదు. ఏదో ఒక రోజు ఈ ఒంటరి జీవితాన్ని వదలిపెట్టి జంటగా జీవిస్తానని తన పెళ్లి గురించి పరోక్షంగా తెలిపింది.

సుశాంత్ సింగ్ సరసన
ప్రస్తుతం భూమి పడ్నేకర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన సంచరియా అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి అభిషేక్ దర్శకుడు. ఈ చిత్రం కూడా విభిన్న కథాంశంతోనే తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











