బాత్రూమ్‌లో నగ్నంగా.. హాట్ హీరోయిన్ భంగిమకు ఫిదా.. వైరల్ ఫోటోషూట్
బాలీవుడ్ పాపులర్ ఫోటోగ్రాఫర్ అయిన డబూ గత ఇరవై ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్‌ను విడుదల చేస్తాడు. డబూ రతాని పేరు మీదుగా విడుదల చేసిన ఈ క్యాలెండర్ సెగలు పుట్టించేలా ఉంటుంది. హీరోయిన్ల అందాలను వివిద రకాల భంగిమలో చూపిస్తూ ఉంటాడు. గతేడాది ఈ క్యాలెండర్‌పై విద్యాబాలన్ మెరిసింది. అయితే ఈ ఏడాది మాత్రం భూమి ఫెడ్నేకర్ దర్శనమివ్వబోతోంది.

ప్రతిభ గల నటి..
పాత్ర కోసం దాదాపు 12 కిలోల బరువు పెరిగి మొదటి సినిమా (ధమ్ లగాకే హైసా)తోనే బెస్ట్ డెబ్యూ హీరోయిన్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది. అక్కడి నుంచి ఓ వెబ్ సిరీస్‌లో కనిపించి చాలా కాలం మాయమైపోయింది. మళ్లీ టాయిలెట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఘన విజయం సాధించి ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది.

లస్ట్ స్టోరీస్‌లోనూ...
బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్. మనదగ్గర ఆరుగురు పతివ్రతలు లాంటి కాన్సెప్ట్ తెరకెక్కించిన లస్ట్ స్టోరీస్‌లో నాలుగు ప్రధాన కథలు ఉంటాయి. అందులో పని మనిషి, యజమాని కథకు సంబంధించిన పార్ట్‌లో నటించింది. హాట్ హాట్‌గా కనిపించి అందర్నీ ఆకట్టుకుంది.
తాజాగా మరో అవార్డు..
తాజాగా మరో ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది భూమి ఫెడ్నేకర్. సాండ్ కీ ఆంఖ్ చిత్రంల్ నటనకు గానూ తాప్సీ, భూమిలకు క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రస్ అవార్డు లభించింది. దీంతో భూమి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Recommended Video


హాట్ ఫోటో షూట్..
బాలీవుడ్‌లో డబూ రతానీ క్యాలెండర్‌కు ఉండే పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. జులై 2020లో విడుదల కానున్న ఈ క్యాలెండర్‌పై భూమి మెరవనుంది.దీనికి సంబంధించిన ఓ చిన్న శాంపుల్‌ను సోషల్ మీడియాలో వదిలింది. నగ్నంగా ఉన్న ఈ ఫోటోలో భూమి మరింత హాట్‌గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











