నీ మరణం వెనుక రహస్యం.. నీ గుండెల్లోనే సమాధి.. సుశాంత్ సూసైడ్‌పై భూమిక భావోద్వేగం
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వారం రోజుల తర్వాత ప్రతీ ఒక్కరు కూడా యువ హీరో మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ప్రత్యక్ష అనుబంధం, సన్నిహిత సంబంధాలు ఉన్న వారు ఆ మహా విషాదం నుంచి తేరుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటి భూమిక చావ్లా భావ్వోద్వేగాన్ని తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో వ్యక్తం చేశారు. ఆమె పోస్టులో ఏం చెప్పారంటే..
Recommended Video

ఎంఎస్ ధోని బయోపిక్‌లో
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, భూమిక చావ్లా ఇద్దరు కలిసి ఎంఎస్ ధోని బయోపిక్‌లో కలిసి నటించారు. ఆ చిత్రంలో అక్కా, తమ్ముడి పాత్ర. సినిమాలో భావోద్వేగాన్ని ఆ పాత్రలతో పండించారు. ఆ తర్వాత నిజ జీవితంలో కూడా ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి ఓ ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది.

మనోవేదన గురైన భూమిక
జూన్ 14వ తేదీన సుశాంత్ మరణం అందర్నీ షాక్‌కు గురిచేసినట్టే భూమికకు కూడా తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. సుశాంత్ మరణ వార్త ఆమెను తీవ్రంగా మనో వేదనకు గురిచేస్తున్నది. గత వారం రోజులుగా సుశాంత్ మెమొరీస్‌తోనే జీవిస్తున్నారు. ఈ సందర్భంగా ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టు అందర్ని ఎమోషనల్‌కు గురిచేసింది.

వారం తర్వాత ఇన్స్‌టాగ్రామ్‌లో భూమిక చావ్లా
సుశాంత్ మరణాంతరం వారం రోజుల తర్వాత భూమిక చావ్లా ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. నీవు ఏ లోకంలో ఉన్నా.. భగవంతుడి చేతుల్లోనే ఉన్నావని భావిస్తున్నాను. నీవు ఈ లోకం విడిచి వారం గడుస్తున్నప్పటికీ.. నీవు తీసుకొన్న తీవ్రమైన నిర్ణయం వెనుక కారణం ఏమిటనే విషయం నీతోనే తీసుకెళ్లావు. ఆ సీక్రెట్ ఏమిటో నీ గుండె, మనసులోనే సమాధి అయిపోయింది అని భూమిక తన పోస్టులో పేర్కొన్నారు.

విమర్శలు, ఆరోపణలు వద్దు..
నీ మరణంతో మనో వేదనకు గురవుతున్న ప్రతీ ఒక్కరికి నీ ఆత్మ శాంతించేలా ప్రార్థనలు చేయాలని ప్రాధేయపడుతున్నాను. నీ మరణం తర్వాత అనేక విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ వాటికి ఏ సమాధానాలు దొరకే ప్రసక్తి లేదు. ఇండస్ట్రీలోని కొన్ని గ్రూపుల కారణంగా అని కొందరు, నీ రిలేషన్స్ వల్ల అని కొందరు ఏదోదే మాట్లాడుతున్నారు. వాళ్లందరికీ నేను ఒకటే సూచిస్తున్నాను. ఈ లోకంలో మనతో లేనివారి గురించి చెడుగా మాట్లాడకుండా అతని ఆత్మకు శాంతి కలిగేలా చూడాలని కోరుతున్నాను అని అన్నారు.

సుశాంత్ ఆత్మను గౌరవిద్దాం
ఈ లోకం విడిచి వెళ్లిన సుశాంత్ ఆత్మను గౌరవిద్దాం. ఏదోదే తప్పుడు ఆరోపణలు చేసి అవమానించడం కంటే ఓ పాజిటివిటిని పెంచేలా ప్రయత్నిద్దాం. సుశాంత్ మరణానికి ఇండస్ట్రీ ఓ సొల్యూషన్ సూచిస్తుందని ఆశిద్దాం. బహిరంగ వేదికలపై తప్పుడు వ్యాఖ్యలు చేయకుండా సరైన జాగ్రత్తలు తీసుకొందాం అంటూ భూమిక తన పోస్టులో పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











