Bhumika Chawla : భూమిక జీవితం నాశనం చేసిన ఆ హీరో భార్య .. ఒక్క తప్పుతో కెరీర్ క్లోజ్

చిత్ర పరిశ్రమలో విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఎవరో చేయాల్సిన పాత్రలు ఇంకెవరో చేస్తుంటారు. కొందరికీ ఆ నిర్ణయాలు సక్సెస్‌ను తీసుకొస్తే మరికొందరికి మాత్రం ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు ఇవి జీవితాలపై ప్రభావం చూపుతూ నటీనటుల కెరీర్‌లను నాశనం చేస్తుంటాయి. అలా కొందరి కారణంగా స్టార్ హీరోయిన్ భూమిక ఛావ్లా కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. ఈ వివరాల్లోకి వెళితే..

అమాయకమైన చూపు, ముఖంపై చెరగని చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపిస్తూ కొన్నేళ్లపాటు యువత కలల రాకూమారిగా నిలిచారు భూమిక ఛావ్లా. స్కిన్ షోలు, రొమాంటిక్ సీన్స్, అందాల ఆరబోతకు దూరంగా ఉంటూ చాలా పద్దతిగా యువత గుండె కోసేసింది ఈ హర్యానా బ్యూటీ. 21 ఆగస్ట్ 1978లో న్యూఢిల్లీకి చెందిన పంజాబీ ఫ్యామిలీలో జన్మించారు భూమిక ఛావ్లా. ఆమె తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఇంట్లో చిన్నది కావడంతో అంతా భూమికను గారభంగా చూసుకునేవారు.

Bhumika Chawla reveals she was replaced in Jab We Met Who got that opportunity

చదువు పూర్తి చేసిన తర్వాత ముంబైకి మకాం మార్చి మోడలింగ్‌లో అవకాశాల కోసం ప్రయత్నించిన ఆమె పలు వీడియో ఆల్బమ్స్ కూడా చేశారు. తొలుత జీ టీవీలో హిప్ హిప్ హుర్రేలో తళుక్కున మెరిసిన భూమిక ఛావ్లా తన సినీ జీవితాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ నుంచే ప్రారంభించారు. కింగ్ అక్కినేని నాగార్జున నిర్మాతగా సుమంత్ నటించిన యువకుడు చిత్రం ద్వారా భూమిక వెండితెరపై అడుగుపెట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినా భూమిక అందం, నటన ప్రేక్షకుల్లో బాగా టచ్ చేసింది.

ఆ వెంటనే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - ఎస్‌జే సూర్యల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఖుషి బ్లాక్‌బస్టర్ కావడంతో భూమిక స్టార్ హీరోయిన్ అయిపోయారు. ఆ తర్వాత సింహాద్రి, ఒక్కడు, వాసు, స్నేహమంటే ఇదేరా, జై చిరంజీవా, సాంబ, నా ఆటోగ్రాఫ్ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా నిలిచారు. పవన్ కళ్యాణ్ (ఖుషీ), మహేశ్ బాబు (ఒక్కడు), ఎన్టీఆర్‌ (సింహాద్రి)ల కెరీర్‌ల 7వ సినిమాలో భూమిక హీరోయిన్‌గా నటించగా.. ఆ మూడు చిత్రాలు ఇండస్ట్రి హిట్స్ కావడం ఓ అరుదైన రికార్డు.

మిస్సమ్మ, సత్యభామ, అనసూయ, అమరావతి వంటి చిత్రాలతో మళ్లీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఊపు తెచ్చారు. హిందీలో తెరేనామ్, రన్ వంటి చిత్రాల్లో నటించింది. యోగా గురు భరత్ ఠాకూర్‌తో ప్రేమలో పడిన ఆమె 2007లో ఆయనను పెళ్లాడారు భూమిక. ఎంఎస్ ధోని బయోపిక్‌తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దేశాన్ని తనవైపుకు తిప్పుకున్నారు. తెలుగులోనూ మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ)లో నటించారు. 2024లో చివరిసారిగా నామ్ అనే హిందీ చిత్రంలో కనిపించిన భూమిక కొత్తగా ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

అయితే భూమిక కెరీర్ ఇలా ఉండాల్సింది కాదట. ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్‌గా ఉండాల్సిన దశలో చిన్న పొరపాటు ఆమె కెరీర్‌ను మలుపు తిప్పిందట. షాహిద్ కపూర్‌ - కరీన్‌ కపూర్‌ల హిట్ చిత్రం జబ్ వీ మెట్ సినిమాలో తొలుత హీరోయిన్‌గా భూమిక చావ్లాను అనుకున్నారట. హీరో కూడా మరొకరని సెలెక్ట్ చేశారట. అయితే ఈ సినిమాకు తొలుత కమిటైన నిర్మాతలు తప్పుకోవడంతో ప్రొడ్యూసర్‌లు మారారట. కొత్త వారి ఎంట్రీతో హీరోయిన్‌గా భూమికను తప్పించి ఆమె ప్లేస్‌లో కరీనాను , హీరోగా షాహిద్ కపూర్‌ను ఎంపిక చేసి సినిమా పూర్తి చేయగా ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

అయితే ఈ సినిమా కోసం తాను ఏడాది పాటు ఏ కొత్త ప్రాజెక్ట్‌ను ఒప్పుకోలేదని భూమిక ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తర్వాత తాను అంగీకరించిన ఏ సినిమా కూడా సెట్స్ మీదకి వెళ్లలేదని, తాను నటించిన ఈ సినిమా కూడా హిట్ కాలేదని భూమిక ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ జబ్ వీ మెట్‌లో భూమిక నటించి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేది. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన కరీనా కపూర్ ఆ తర్వాత వరుస హిట్స్‌లో బాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగారు. అందుకే పెద్దలు అంటూ ఉంటారు తినే గీత ఉండాలని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X