స్టార్ హీరోలకు ఇది సాధ్యమా.. ఈ వయసులో 70 కోట్ల టాక్స్ కట్టిన అమితాబ్ బచ్చన్!

Recommended Video

Amitabh Bachchan Pays Jaw-Dropping 70 Cr Tax || Filmibeat Telugu

భారత చలన చిత్ర రంగంలో అమితాబ్ బచ్చన్ స్థానం ఏంటో అందరికి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ 76 ఏళ్ల వయసులో కూడా అలసట లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. అమితాబ్ ఇటీవల నటించిన బద్లా చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. అమితాబ్ బచ్చన్ కేవలం సినిమాలతో మాత్రమే కాదు వాణిజ్య ప్రకటనలతో కూడా బిజీగా గడుపుతున్నారు. అమితాబ్ అత్యధిక సంపాదన కలిగిన నటులలో ఒకరు. బిగ్ బి తాజాగా ఆదాయపు పన్ను విషయంలో వార్తల్లో నిలిచారు.

 70 కోట్ల టాక్స్

70 కోట్ల టాక్స్

అమితాబ్ బచ్చన్ ఇటీవల 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 70 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించిన ఆయన అధికార ప్రతినిధి ప్రకటించారు. ఇది నిజంగా ఆశ్చర్యపోయే విషయమే. కుర్ర హీరోలు, బాలీవుడ్ బడా స్టార్లతో పోటీ పడుతూ అమితాబ్ సంపాదనలో దూసుకుపోతున్నారు. ఈ వయసులో, ఇంత భారీ మొత్తంలో టాక్స్ చెల్లించడం మరే స్టార్ హీరోకు సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 వరుస చిత్రాలు

వరుస చిత్రాలు

అమితాబ్ బచ్చన్ కట్టిన టాక్స్ విలువే 70 కోట్లు ఉంటే ఇక వార్షిక ఆదాయం ఏస్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. వందల కోట్లల్లో ఉంటుంది. 76 ఎల్లా వయసులో అమితాబ్ తీరికలేకుండా నటిస్తున్నారు. ఇటీవల అమితాబ్ నటించిన బద్లా చిత్రం 100 కోట్ల వసూళ్లతో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఓ నిర్మాత. ఇక అమితాబ్ ఆదాయం కేవలం సినిమాల ద్వారా మాత్రమే వస్తుందనుకుంటే పొరపాటే. అమితాబ్ వివిధ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ ఆదాయం పొందుతున్నారు.

2084 మంది రైతులకు

2084 మంది రైతులకు

అమితం బచ్చన్ అధికార ప్రతినిధి విడుదల చేసిన ప్రకటనలో.. బిగ్ బి ఇటీవల ముజఫర్ నగర్ లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన 2084 మంది రైతుల రుణాలు మాఫీ చేసినట్లు పేర్కొన్నారు. ఇలా చారిటి కార్యక్రమాల్లో కూడా అమితాబ్ ముందుంటారు. పూల్వమా ఉగ్రదాడిలో మరణించిన ఒక్కో జవాను కుటుంబానికి అమితాబ్ 10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇలా చారిటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే విధిగా ఆదాయపు పన్ను సకాలంలో చెల్లిస్తున్నారు.

 సౌత్‌లో జోరు

సౌత్‌లో జోరు

ఇక సినిమాల విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్ ఇప్పుడిప్పుడే సౌత్ చిత్రాలలో నటిస్తున్నారు. సైరా నరసింహారెడ్డి చిత్రంలో అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర చిత్రంలో అమితాబ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్, అలియా ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X