నా సమ్మానం నిర్ణయించేది మీరు కాదు... ట్రాల్స్ కు బిగీ బీ ఘాటు రిప్లై

సోషల్ మీడియా ద్వారా ఎవరినైనా సులభంగా చేరుకోగల వెసులుబాటు కలిగినా, దాన్ని దుర్వినియోగిస్తున్న వారే అధికంగా కనిపిస్తున్నారు. ట్రాలింగ్ అనే విష సంస్కృతి పురుడుపోసుకుని, కొత్త మానసిక సమస్యలకు దారితీస్తోంది. అయితే, ఇలాంటి వాటికి లొంగే ప్రసక్తే లేదని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. తనను కించపరిచేవారికి గట్టి సమాధానమిస్తూ, ట్రాలింగ్ పై తనదైన శైలిలో యుద్ధం చేస్తున్నారు.

ఇటీవలే కోవిడ్ 19పై విజయం సాధించి సురక్షితంగా ఇంటికి చేరుకున్న అమితాబ్, మళ్లీ సామాజిక మాధ్యమాలతో ఫ్యాన్స్ కు అందుబాటులోకి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే, ముంబైకి చెందిన ఓ మహిళ బిగ్ బీ పట్లు చేసిన అనుచిత వ్యాఖ్యలు, అతడి దృష్టిని దాటిపోలేదు. "నానావతి ఆసుపత్రిలో మా నాన్నగారికి కరోనా పాజిటివ్ అని తప్పుడు నివేదిక ఇచ్చి, ఆయన మనోవేదనకు కారణమయ్యారు. ఆసుపత్రి యాజమాన్యానికి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు. వారికి డబ్బే ముఖ్యం, అలాంటి ఆసుపత్రికి మీరు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. మీపై ఉన్న నాకున్న గౌరవం నశించిది" అంటూ ట్వీట్ చేసింది.

Big B hits back at a troller, Says My respect is not judged by anyone

ఆమె ట్వీట్ కు ప్రత్యుత్తరం ఇస్తూ బిగ్ బీ "జాన్వీగారు మీ నాన్నగారి పట్ల జరిగిన దానికి నేను చింతిస్తున్నాను. నేను చాలా చిన్న వయసు నుంచే తీవ్ర అనారోగ్య సమస్యలతో అనేక సార్లు ఆసుపత్రి పాలయ్యాను. అప్పటి నుంచే వైద్యులు, ఇతర సిబ్బంది రోగి ఆరోగ్యం పట్ల వహించే శ్రద్ధను గమనిస్తూనే ఉన్నాను. నేను ఏ ఆసుపత్రికి ప్రచారకర్తగా వ్యవహరించడంలేదు. నానావతి ఆసుపత్రిలో నాకు లభించిన ఆదరణకు, చికిత్సకు మాత్రమే వారికి కృతజ్ఞతలు చెప్పాను. నేను ఏ ఆసుపత్రిలో చేరినా ఇదే విధంగా స్పందిస్తాను. మీరు నాపై గౌరవం కోల్పోవచ్చు.

కానీ, నేను వైద్య వృత్తిపట్ల, నా దేశ వైద్యుల పట్ల ఎప్పటికీ గౌరవం కలిగే ఉంటాను. ఇక ఆఖరుగా, నా సమ్మానం, నా గౌరవ మర్యాదలు మీరు నిర్ణయించేవి కావు" అంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడయా ట్రాలింగ్ పై మిన్నకుండిపోకుండా, దానిపై పోరాటం చేయాడమే పరిష్కారమని అమితాబ్ చెప్పకనే చెబుతున్నారు. మరి బిగ్ బీని ఎంతమంది స్ఫూర్తిగా తీసుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X