Katrina Kaif, Vicky Kaushal పెళ్లి ఫుటేజ్ కోసం 100కోట్ల ఆఫర్ చేసిన ఓటీటీ సంస్థ.. ఎందుకంటే?

బాలీవుడ్ సినిమా ప్రపంచంలో ఎలాంటి వేడుకలు జరిగిన కూడా మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా డేటింగ్ అనంతరం పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన స్టార్ కపుల్స్ అయితే భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక విధంగా వారు కూడా పెళ్లి వేడుకలను వ్యాపారంగా మార్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎవరైనా స్టార్ కపుల్స్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పైసా ఖర్చులేకుండా పెళ్లి చేసే కంపెనీలు కూడా ఉంటాయి.

ఇక పెళ్లికి సంబంధించిన వీడియోలకు ఫోటోలకు కూడా వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ విధంగా వీడియో చానల్స్ కు మంచి బిజినెస్ అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ పెళ్లి ఫోటో కోసం కూడా బడా మీడియా సంస్థలు కూడా గట్టిగానే పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది..

గత ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలని..

గత ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలని..

బాలీవుడ్ సినిమా ప్రపంచంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న కత్రినాకైఫ్ మొత్తానికి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. యువ హీరో విక్కీ కౌశల్ తో గత కొన్ని ఏళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్న ఈ బ్యూటీ గత ఏడాది పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ కోవిడ్ పరిస్థితుల ప్రభావం వలన ఆ పెళ్లిని గత కొన్ని నెలలుగా వాయిదా వేస్తూనే ఉన్నారు. మొత్తానికి ఈ వారంలోనే ఈ ఇద్దరూ ఏడడుగులు వేయబోతున్నారు.

ఏమాత్రం ఇబ్బందులు రాకుండా..

ఏమాత్రం ఇబ్బందులు రాకుండా..

గత నెల రోజులుగా హీరో విక్కీ కౌశల్ తన సన్నిహితులతో అలాగే కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు. రాజస్థాన్ లోని ఎంతో చారిత్రాత్మకమైన రాయల్ ప్యాలెస్ లో వివాహం జరగబోతోంది. పెళ్లికి ఏమాత్రం ఇబ్బందులు రాకుండా ప్యాలెస్ కు దగ్గరగా ఉన్న రోడ్లు కూడా బ్లాక్ చేయడం జరిగింది. గత వారం నుంచే ఆ పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీ కూడా గట్టిగా పెంచారు.

మొబైల్ ఫోన్స్ తీసుకు రాకుండా

మొబైల్ ఫోన్స్ తీసుకు రాకుండా

పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలకు కూడా కఠినమైన ఆంక్షలు విధించి నట్లు తెలుస్తోంది. విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ వారి పెళ్లికి వేడుకలకు క్లోజ్ సెలబ్రిటీలు మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. ఎవరు కూడా పెళ్లి వేదికపైకి మొబైల్ ఫోన్స్ తీసుకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఫోటోలు వీడియోలు కూడా బయటకు లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.

100కోట్ల ఆఫర్

100కోట్ల ఆఫర్

అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం కత్రినా కైఫ్ కౌశల్ పెళ్లి స్ట్రీమింగ్ కోసం ఒక బడా మీడియా ఓటీటీ సంస్థ 100కోట్ల ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ స్టార్ సెలబ్రెటీకి దక్కని రేంజ్ లో వీరికి బంపరాఫర్ ఇవ్వడం విశేషం. నిజానికి కొంతమంది స్టార్స్ గతంలో ఇదే తరహాలో పెళ్లి వేడుకలను బిజినెస్ గా చేసుకున్నారు.

Recommended Video

Prabhas Dual role in Salaar. Eye feast for fans. Katrina kaif special song in Salaar
అందుకే భారీ ఆఫర్

అందుకే భారీ ఆఫర్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కత్రినా కైఫ్ విక్కీ కౌషల్ పెళ్లి గురించి అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. కత్రినా గతంలోనే సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకుంటుందని అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ ఎమోషనల్ గా వారి మధ్య బ్రేకప్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు కత్రినా మరొక హీరోను పెళ్లి చేసుకోబోతోంది అనడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ గా మారింది. తప్పకుండా జనాలు ఎగబడి చూస్తారని ఫుటేజ్ కోసం పలు ఓటీటీ సంస్థలు భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X