For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Raj Kundra కేసులో బిగ్ ట్విస్ట్: సీక్రెట్‌ కబోర్డ్‌ను కనిపెట్టిన పోలీసులు.. అందులో ఏం దొరికాయంటే!

  |

  ప్రముఖ వ్యాపారవేత్త, హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ ఫిల్మ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఈ కేసులో ఎన్నో ఊహించని విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ కేసులోని మరింత లోతులను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అన్వేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా సోదాలు జరిపిన పోలీసులను సీక్రెట్ కబోర్డ్ షాక్‌కు గురి చేసింది. ఇందులో ఎన్నో విలువైన ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం!

  బయటకు వస్తున్న కుంద్రా లీలలు

  బయటకు వస్తున్న కుంద్రా లీలలు


  పోర్న ఫిల్మ్స్ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా ప్రస్తుతం పోలీసుల రిమాండ్‌లో ఉన్నాడు. బయట మాత్రం ఆయనతో లింకులున్న చాలా మందిని క్రైమ్ బ్రాంచ్ అధికారాలు విచారిస్తున్నారు. దీంతో రాజ్ కుంద్రా లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఫలితంగా ఈ వ్యవహారం ప్రతిరోజూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంటోంది.

  కేటీఆర్‌పై నవీన్ పోలిశెట్టి ట్వీట్: జాతి రత్నంపై దారుణమైన ట్రోలింగ్.. వామ్మో అందరూ అలాంటి కామెంట్లే

  తెరపైకి వస్తున్న కుంద్రా బాధితులు

  తెరపైకి వస్తున్న కుంద్రా బాధితులు

  రాజ్ కుంద్రా బారిన పడిన మోడళ్లు, నటీమణుల లిస్టు చాలా పెద్దదిగానే ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖ హీరోయిన్లు బయటకు వచ్చి.. తమ బాధనంతా వెల్లగక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరికొంత మంది మీడియా ద్వారానో, సోషల్ మీడియా ద్వారానో తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటున్నారు. దీంతో రాజ్ కుంద్ర బాధితుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.

  రాజ్ కుంద్రా కేసులో కీలక మలుపు

  రాజ్ కుంద్రా కేసులో కీలక మలుపు

  దేశ వ్యాప్తంగా సంచలన రేకెత్తించిన రాజ్ కుంద్రా నీలిచిత్రాల కేసు రోజుకో ములుపు తిరుగుతూనే ఉంది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణను ముమ్మరం చేయడంతో ఎన్నో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. రాజ్ కుంద్రాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసులో ఓ కీలక విషయం వెలుగులోకి రావడంతో ట్విస్ట్ చోటు చేసుకుంది.

   సీక్రెట్ కబోర్డు కనిపెట్టిన పోలీసులు

  సీక్రెట్ కబోర్డు కనిపెట్టిన పోలీసులు

  ముంబైలోని అంధేరీలో ఉన్న వియాన్ అండ్ జేఎల్ స్ట్రీమ్ ఆఫీస్‌లో క్రైమ్ బ్రాంచ్ అధికారులు మరోసారి సోదాలు జరిపారు. ఇందులో వాళ్లకు ఓ సీక్రెట్ కబోర్డ్ కనిపించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి జూలై 19నే అక్కడ వాళ్లు వెతకగా ఇది కనిపించలేదు. ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రాతో సంబంధం ఉన్న పలువురుని శనివారం ప్రశ్నించడంతో వాళ్లు ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిసింది.

  ఒంటి మీద నూలుపోగు లేకుండా స్నేహా ఉల్లాల్: ఓ రేంజ్‌లో రచ్చ చేసిన జూనియర్ ఐశ్వర్యరాయ్

  Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
   క్రైమ్ బ్రాంచ్‌కు చిక్కిన కీలక పత్రాలు

  క్రైమ్ బ్రాంచ్‌కు చిక్కిన కీలక పత్రాలు

  సీక్రెట్‌గా ఉంచిన కబోర్డులో క్రైమ్ బ్రాంచ్ అధికారులకు కీలక ఆధారాలు లభ్యం అయినట్లు తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. పోలీసులకు లభ్యమైన వాటిలో ఎక్కువ భాగం క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పత్రాలే ఉన్నట్లు తెలిసింది. వాటితో పాటు కేసుకు సంబంధించిన కీలక డాక్యూమెంట్లు కూడా దొరికాయి. దీంతో కుంద్రా పుట్ట పెద్దదే అని పోలీసులు నిర్ధారిస్తున్నారు.

   పత్రాలను స్టడీ చేస్తున్న అధికారులు

  పత్రాలను స్టడీ చేస్తున్న అధికారులు

  సీక్రెట్ కబోర్డులో దొరికిన పత్రాలను క్రైమ్ బ్రాంచ్ అధికారుల బృందం స్టడీ చేస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అందులో మోడళ్లు, హీరోయిన్లతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా అన్న దిశగా వాళ్లు అన్వేషణ జరుపుతున్నారట. ఇందులో నీలి చిత్రాలకు సంబంధించిన ఒక్క ఆధారమైనా దొరికితే కుంద్రాకు ఉచ్చు బిగుసుకుంటుందని టాక్.

  English summary
  Big Twist in Raj Kundra Case: The Crime Branch has founds Secret Cupboard in Viaan Office. many files in the cupboard which have information related to Cryptocurrency.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X