Bigg Boss బ్యూటీకి అరెస్ట్ వారెంట్ల్.. చీటింగ్ కేసులో అరెస్ట్ తప్పదా?
బిగ్‌బాస్ కంటెస్టెంట్ స్వప్ప చౌదరీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. చీటింగ్ ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేయడంతో ఆమె ఇబ్బందులను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఫిర్యాదు మేరకు స్వప్న చౌదరీనికి కోర్టు అరెస్ట్ వారెంట్ చేయడంతో ఆమె వివాదంలో కూరుకుపోయింది. స్వప్న చౌదరీకి సంబంధించిన వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

భారీగా పారితోషికం తీసుకొని
బిగ్‌బాస్ 11 షోలో రాణించిన కంటెస్టెంట్ స్వప్న చౌదరీ గతంలో ఓ షోలో పాల్గొంటానని చెప్పి ఒప్పందం కుదుర్చుకొన్నది. ఆ మేరకు భారీగా పారితోషికాన్ని అందుకొన్నారు. అయితే నిర్వాహకులు ముందు చెప్పకుండా అర్ధాంతరంగా ఆమె షోను క్యాన్సిల్ చేసుకొన్నది. ఆమె తీసుకొన్న అడ్వాన్స్ కూడా వాపసు చేయకపోవడంతో నిర్వాహకులు ఆమెను సంప్రదించారు. పలుమార్లు ఆమెను కోరినా రెమ్యునరేషన్ వెనక్కి తిరిగి ఇవ్వలేదు. దాంతో స్వప్న చౌదరికి షో నిర్వాహకుల మధ్య వివాదం మరింత ముదిరింది.

షోలో ఫెర్ఫార్మెన్స్ చేయకుండా
అయితే 2018లో అక్టోబర్ 14వ తేదీన ఈవెంట్‌లో పాల్గొంటానని చెప్పిన స్వప్న చౌదరీ.. షోలో ఫెర్ఫార్మెన్స్ చేయకుండా తమను చీట్ చేసిందని లక్నోలోని ఆషియానా పోలీస్ స్టేషన్‌లో నిర్వాహకులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదంలో స్వప్న చౌదరీతోపాటు ఈవెంట్ మేనేజర్స్ జునైద్ ఆహ్మద్, నవీన్ శర్మ, ఇవాద్ ఆలీ, అమిత్ పాండే, రత్నాకర్ ఉపాధ్యాయ్‌పై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో లక్నోలోని స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్స్ జారీ చేసింది.

1000పై టికెట్ల అమ్మకం
లక్నోలోని పోలీసులు వెల్లడించిన ప్రకారం.. 2018లో అక్టోబర్ 13వ తేదీన ఈవెంట్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. స్మృతి ఉపావన్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి సంబంధించి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా రూ.300 టికెట్లను అమ్మకాలు జరిపారు. దాదాపు 1000 టికెట్లకుపైగా అమ్మడంతో భారీగా క్రేజ్ ఏర్పడింది. అయితే షో జరగడానికి ముందు వేదిక వద్ద జరిగిన గందరగోళం కారణంగా షో క్యాన్సిల్ అయింది. దాంతో ఆడియెన్స్ తమ టికెట్ సొమ్మును వెనుకకు చెల్లించమని డిమాండ్ చేశారు. ఆపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అని చెప్పారు.

కోర్టు ఛార్జీలు చెల్లించాలంటూ
స్వప్న చౌదరీపై నమోదైన పిటిషన్ ప్రకారం.. టికెట్ సొమ్ముతోపాటు షో రద్దు చేయబడిన మొత్తానికి చార్జీలు, కోర్టు ఛార్జీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్వప్న చౌదరీ దాఖలు పిటిషన్‌ను కోర్టు తీరస్కరించడంతో ఆమెకు కష్టాలు మరింత పెరిగాయి. ఈ కేసు విచారణ నవంబర్ 22 తేదీన విచారణ జరుగనున్నది.
Recommended Video

స్వప్న చౌదరీ సినీ కెరీర్ ఇలా..
స్వప్న చౌదరీ కెరీర్ విషయానికి వస్తే.. హర్యానాకు చెందిన డ్యాన్సర్; సింగర్, మోడల్, నటి. బిగ్‌బాస్ 11 సీజన్‌లో పాల్గొనడం ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకొన్నారు. ఆ తర్వాత వీర్ కి వెడ్డింగ్, నాను కి జాను, జర్నీ ఆఫ్ భాంగోవర్ చిత్రానల్లో నటించింది. డ్యాన్సర్‌గా ఆమె చేసిన ఫెర్ఫార్మెన్స్‌కు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ లభించింది. అంతేకాకుండా ఆమె వీడియోలు వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











