For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిక్కి తంబోలి నాతో దారుణంగా.. నా ప్రేయసి నాపై రేప్ కేసు.. సల్మాన్‌కు బాధ చెప్పుకొన్న సెలబ్రిటీ

  |

  బిగ్‌బాస్ హిందీ సీజన్ 14 షోలో కంటెస్టెంట్ల మధ్య విభేదాలు, వివాదాలతో ముందుకు సాగుతున్నది. రెండోవారం ముగియకముందే ఇంటిలోని సభ్యుల మధ్య గొడవ రచ్చగా మారింది. వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన, వినోదం, భావోద్వేగంతో కూడిన సన్నివేశాలు కనిపించాయి. ఇంటి సభ్యుడు, బాలీవుడ్ నటుడు, తను వెడ్స్ మను ఫేం ఇజాజ్ ఖాన్ వ్యక్తిగత జీవితం ఎపిసోడ్‌ను ఎమోషనల్‌గా మార్చింది. హోస్ట్ సల్మాన్ ఖాన్ ఇంటిలో సిద్ధార్థ్ శుక్లాతో ఇజాజ్ మాట్లాడుతున్న ఓ వీడియోను చూపించి ఇజాజ్‌ను ఏం జరిగిందో చెప్పమని అడిగితే .. ఆయన ఎమోషన్‌గా తన వ్యక్తిగత జీవితాన్ని, ఇంటిలో జరిగిన సంఘటనలు వివరిస్తూ..

   అఫైర్ నా జీవితాన్ని దెబ్బ తీసింది

  అఫైర్ నా జీవితాన్ని దెబ్బ తీసింది

  నా జీవితంపై ప్రేమ వ్యవహారం కోలుకోలేని దెబ్బ కొట్టింది. నమ్మకం అనే విషయంపై నా ప్రేయసితో విభేదాలు నెలకొన్నాయి. నా అఫైర్ విషయంలో చాలా తప్పులు మా మధ్య జరిగాయి. వాటిని పరిష్కరించుకోవడానికి చాలా ప్రయత్నించాను. కానీ వాటినా సానుకూలంగా మలచుకోవడంలో సఫలం కాలేదు. ఆ అనుభవాలే నన్నో మనిషిగా మార్చాయి అని ఇజాజ్ ఖాన్ చెప్పారు.

   లివింగ్ రిలేషన్ తర్వాత

  లివింగ్ రిలేషన్ తర్వాత

  చాలా ఏళ్లు లివింగ్ రిలేషన్ షిప్ నా ప్రేయసితో సాగింది. అయితే పెళ్లి విషయం వచ్చే సరికి నిరాకరించింది. నా పెళ్లి ప్రపోజల్‌ను నిరాకరించడంతో జీవితంలో ఊహించని సంఘటనలు చోటుచేసుకొన్నాయి. నన్ను పెళ్లి చేసుకొంటానని చెప్పి మాట తప్పాడనే ఆరోపించింది. దానిని ఆధారంగా చేసుకొని ప్రేయసి నాపై రేప్ కేసు పెట్టింది. దాంతో జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

   బ్రేకప్‌తో జీవితం సర్వనాశనం

  బ్రేకప్‌తో జీవితం సర్వనాశనం

  నా ప్రేయసి పెట్టిన కేసుతో నా తల్లిదండ్రులతో నాకు విభేదాలు వచ్చాయి. నా బ్రేకప్‌కు కారణం నువ్వే అంటూ నా తండ్రి వేలెత్తి చూపాడు. నా ప్రేయసితో విభేదాల రావడానికి నీ ప్రవర్తనే కారణమని నా తండ్రి నాపై నిందలు వేశారు. ఆ తర్వాత కుటుంబంలో నెలకొన్న సంఘటనలతో తల్లిదండ్రులకు దూరమయ్యాను. ఆ సమయంలోనే తను వెడ్స్ మను సినిమా ప్రీమియర్ ఉంది. ఆ షోకు హాజరుకాలేదు. మానసిక ప్రశాంత కోసం ధర్మశాలకు వెళ్లిపోయాను అని ఇజాజ్ ఖాన్ చెప్పారు.

  Birthday Wishes For The Bollywood Legend From Tollywood Stars
  నిక్కి తంబోలి నాతో దారుణంగా

  నిక్కి తంబోలి నాతో దారుణంగా

  ఇక బిగ్‌బాస్ ఇంటిలో నాతో నిక్కి తంబోలి, రుబీనా చాలా దారుణంగా ప్రవర్తించారు. వారు నాతో చాలా దురుసుగా ప్రవర్తించడంతో నేను షాక్ తిన్నాను. ఓ దశలో వారి ప్రవర్తన తీరుతో దిగ్బ్రాంతికి గురయ్యాను అని ఇజాజ్ అంటే.. బిగ్‌బాస్ ఇంటిలో అలాంటివి జరగవు. ఇది చాలా సురక్షితమైన ప్రదేశం అని సిద్దార్థ్ శుక్లా అనడం వీడియోలో కనిపించింది. తన వ్యక్తిగత విషయాలను సిద్ధార్థ్ శుక్లాకు వెల్లడించిన వీడియోను ప్రదర్శించిన తర్వాత సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. తప్పు దారిలో వెళితే.. చెడు సంఘటనలు అనుభవించాల్సిందే. ఈ గేమ్‌లో నీవు చక్కగా ఆడితే అందరూ నిన్ను గౌరవిస్తారు అని అన్నాడు.

  English summary
  Bigg Boss 14's Weekend Ka Vaar: Contestant Eijaz Khan reveals about his love break up, Rape case with Salman Khan. He said, He commits some mistake, That impacts a lot on his life. Because of his break up impact, He left mumbai and went Dharashala.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X