10 మంది సూట్‌కేసులు సర్దుకోండి.. బయటకు వెళ్లిపోండి.. బిగ్‌బాస్ వార్నింగ్
బిగ్‌బాస్ 14 సీజన్‌లో రెండోవారం ఎలిమినేషన్‌లో సరదా సంఘటనలు చోటుచేసుకొన్నాయి. ఇంటిలోకి కొందరు క్రికెటర్లు, సెలబ్రిటీలు సందర్శించడంతో వీకెండ్ కా వార్ ఎపిసోడ్ వినోదంగా మారినట్టు కనిపించింది. ఇంటి సభ్యుల ప్రవర్తనతో విసిగిపోయిన బిగ్‌బాస్ అందరికి గట్టి షాక్ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ వేదికపై నుంచి వార్నింగ్ ఇస్తూ..

నిక్కి తంబోలి సేఫ్
వీకెండ్ కా వార్‌లో భాగంగా శనివారం జరిగిన ఎపోసిడ్‌లో ఈ వారం కంటెస్టెంట్ నిక్కి తంబోలి సేఫ్ అయ్యారు. సేఫ్ అయిన తర్వాత సీనియర్ సెలబ్రిటీలు సిద్దార్థ్ శుక్లాతో కలిసి ఇంటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియలో పాల్గొనే అవకాశం నిక్కి తంబోలికి దక్కింది.

బిగ్‌బాస్ ఇంటిలో క్రికెటర్లు
ఇంటిలోని సభ్యులను పలకరించేందుకు ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన క్రికెటర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ఇజాజ్ ఖాన్‌తో కలిసి సరదాగా మాట్లాడుతూ కనిపించారు. ఇజాజ్ ఖాన్‌తో హర్థిక్ పాండ్యా కామెడీ పండించారు. ఇంటిలో ఫోర్లు, సిక్సులు కొట్టేది ఎవరు అని అడిగితే.. నేనే అంటూ ఇజాజ్ ఖాన్ సమాధానం ఇవ్వడంతో క్రికెటర్లు నవ్వుల్లో మునిగిపోయారు.

పది మంది సూట్‌కేసులు సర్దుకోండి..
ఆదివారం జరిగే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను కలర్స్ టీవీ రిలీజ్ చేసింది. అయితే రెండు వారాల తర్వాత తొలి ఇంటి సభ్యుడి కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్ షాకిచ్చాడు. ఇంటిలో మీరు ఉండటం వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. పది మందిని మీరు సూట్‌కేసులు సర్దుకోండి అంటూ సల్మాన్ ఖాన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
Recommended Video

మీ వల్ల షోకు లాభం లేదు
బిగ్‌బాస్ షోలో మితిమీరిన వేషాలు వేయొద్దు. ఓవర్ స్మార్ట్‌గా వ్యవహరించవద్దు. మీ వల్ల బిగ్‌బాస్ షోకు లాభం లేదు. పది మంది కంటెస్టెంట్లు ఇంటిని వదిలి వెళ్లిపోండి. మీతో సమస్యలు తప్ప మరో లాభం లేదు అంటూ సల్మాన్ ఖాన్ మండిపడ్డారు. ప్రస్తుతం ఆదివారం విడుదల చేసిన ప్రోమోలు తాజా ఎపిసోడ్‌పై అంచనాలు, ఆసక్తిని పెంచాయి.


Click it and Unblock the Notifications











