సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు.. బిగ్‌బాస్ బ్యూటీ అరెస్ట్!
బిగ్‌బాస్ సీజన్ 9 ఫేమ్ యువికా చౌదరిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. షెడ్యూల్ కులాలను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఆమెను సోమవారం (అక్టోబర్ 18)వ తేదీన అరెస్ట్ చేశారు. యువికా చౌదరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలనోే కాకుండా సినీ పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. యువికా చౌదరీ వ్యక్తిగత జీవితం, తాజా వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

షారుక్ ఖాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన యువికా చౌదరీ వర్థమాన నటిగా బాలీవుడ్‌లో రాణిస్తున్నారు. షారుక్ ఖాన్ నటించిన ఫిర్ భీ దిల్ హై హిందూస్థానీ చిత్రం ద్వారా సిని పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత షారుక్ ఖాన్‌తో ఓం శాంతి ఓం సినిమాలో నటించారు. ఆ తర్వాత యారానా, వీరేయ్ కీ వెడ్డింగ్ లాంటి చిత్రాల్లో నటించారు.
యువికా చౌదరీ మలేయాలి జోతేయాలి అనే కన్నడ చిత్రంలో హీరో గణేష్ సరసన కూడా నటించారు. టెలివిజన్ రంగంలో ఎంటీవీ స్ల్పిట్‌విల్లా 10, నాచ్ బలియే 9, ఇంకా ఎంటీవీ రూపొందించిన పలు షోలో నటించారు.

దళిత సామాజిక కార్యకర్త ఫిర్యాదు
ఇటీవల కాలంలో దళితులను టార్గెట్‌గా చేసుకొని యువికా చౌదరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. 2021 మే సంవత్సరంలో యువికాపై దళిత్ సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదుతో ఆమెను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్పీ అండ్ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఎస్సీలపై విద్వేషపూరితమైన వ్యాఖ్యలు
యువికా చౌదరీ దంపతులు ఎస్సీలపై విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. భర్త ప్రిన్స్ నరులాతో కలిసి దళితులను కించపరిచే విధంగా వీడియోను చిత్రీకరించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ కావడంతో దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత దళితులకు క్షమాపణ చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగింది.

బెయిల్ విడుదలైన యువికా చౌదరీ
తాజాగా అక్టోబర్ 18వ తేదీన మరోసారి దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెను బెయిల్‌పై విడుదల చేశారు. అయితే యువికా తీరుపై దళితులు, సామాజిక కార్యకర్తలు భగ్గుమంటున్నారు.
Recommended Video

యువికా అరెస్ట్‌పై స్పందన
యువికా చౌదరీ అరెస్ట్‌పై ఆమె తరుఫు లాయర్ మీడియా ద్వారా స్పందించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం నా క్లయింట్ యువికా చౌదరీపై విచారణ, దర్యాప్తు జరుగుతున్నది. ప్రస్తుతం తాత్కాలిక బెయిల్ లభించింది. ఎస్పీలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. వాటిపై దర్యాప్తు కొనసాగుతున్నది అని యువిక చౌదరీ తరఫు లాయర్ అశోక్ బిష్ణోయి మీడియాకు తెలిపారు.


Click it and Unblock the Notifications











