బిగ్‌బాస్ బ్యూటీపై రెండు నెలల నిషేధం... అధికారుల ఎఫ్ఐఆర్‌తో కష్టాల్లోకి..

మహారాష్ట్రలో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్నది. ఈ ప్రమాదం నుంచి సాధారణ ప్రజలను గట్టెక్కించడానికి కఠినమైన నిబంధనలను బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) అమల్లోకి తెచ్చింది. అయితే ఇటీవల కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కరోనావైరస్ పాజిటివ్‌తో షూటింగుకు హాజరైన బిగ్‌బాస్ ఫేమ్ గౌహర్ ఖాన్‌పై బీఎంసీ కొరడా ఝులిపించింది.

అయితే గౌహర్ ఖాన్ చర్యలపై తీవ్రంగా స్పందించిన బీఎంసీ... ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. నగర భద్రతకు, సురక్షితకు ఎలాంటి రాజీ ఉండదు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన బాలీవుడ్ యాక్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ప్రతీ సాధారణ పౌరుడు అనుసరించాల్సిన రూల్స్‌ను సెలబ్రిటీలు కూడా ఫాలో అవ్వాలి. కరోనావైరస్‌ను తుదముట్టించాలంటే ప్రతి ఒక్కరు రూల్స్ ఫాలో అవ్వాలి అంటూ ట్వీట్ చేసింది.

 Bigg Boss Fame Gauahar Khan banned for two months in Bollywood by FWICE

గౌహర్‌ ఖాన్‌పై బీఎంసీ అధికారులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) కూడా తీవ్రంగా స్పందించింది. గౌహర్ ఖాన్‌పై రెండు నెలల నిషేధం విధిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆమె అనుసరించిన తీరు ప్రొఫెషనల్‌గా సరికాదు. బాధ్యతారాహిత్యమైన ప్రవర్తనతో అధికారుల అగ్రహానికి గురయ్యారు అని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ తెలిపింది. సినిమా పరిశ్రమలో అన్ని విభాగాల వారు ఈ నిషేధాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X