పైన మొత్తం తీసేసిన యంగ్ హీరోయిన్.. అవి కనిపించడంతో అసలు మేటర్ లీక్
సినీ రంగానికి సంబంధించి సోషల్ మీడియాలో ఎంతో మంది హీరోయిన్లు తమదైన రీతిలో సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే బోల్డు బిహేవియర్‌తో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో ఉర్ఫీ జావేద్ ఒకరు.
చాలా కాలం క్రితమే నటిగా ప్రయాణం మొదలు పెట్టిన ఈ భామ.. సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలతోనే సంచలనం అయిపోయింది. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఉర్ఫీ జావేద్ ఓ షాకింగ్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

సీరియల్ నటిగా పాపులారిటీ
ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం కుటుండానికి చెందిన ఉర్ఫీ జావేద్.. చదువు పూర్తైన వెంటనే సోనీ టీవీలో ప్రసారం అయిన 'బడే భయ్యా కి దుల్హానియా' అనే సీరియల్ ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'చంద్ర నందిని', 'మేరీ దుర్గా', 'జేపన్నా', 'దయాన్', 'యే రిష్తా క్యా కెహ్లతా హై' వంటి ధారావాహికల్లో నటించి యమ పాపులారిటీని సొంతం చేసుకుంది.

బిగ్ బాస్ షోతో మరింతగానే
ఏకధాటిగా సీరియళ్లు చేస్తూ కెరీర్ పరంగా బిజీగా గడుపుతోన్న ఉర్ఫీ జావేద్.. హిందీలో ప్రసారం అయిన 'బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్'లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. ఎన్నో అంచనాలతో ఇందులోకి ఎంట్రీ ఇచ్చినా.. తక్కువ రోజులకే ఎలిమినేట్ అయిపోయింది. అయినా ఉర్ఫీ తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అప్పటి నుంచి మరింతగా రెచ్చిపోతూనే ఉంది.

వివాదాలు, ఎఫైర్లతో రచ్చ
నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఉర్ఫీ జావేద్.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ముఖ్యంగా 2018లో తన బాయ్‌ఫ్రెండ్ పరాస్ కల్నావత్‌కు బ్రేకప్ చెప్పింది. అలాగే, ఇస్లాం మతం గురించి వివాదాస్పద కామెంట్లు చేయడం.. లైంగిక వేధింపుల గురించి మాట్లాడడం వంటి వాటిలో ఎన్నో కాంట్రవర్శీలతో ఎంతో మందికి శత్రువులా మారిపోయింది.

సరికొత్త ఫ్యాషన్ ఐకాన్‌గా
ఉర్ఫీ జావేద్ పేరు సెన్సేషన్ అవడానికి ఆమె ఫాలో అయ్యే ఫ్యాషనే ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ చిన్నది చిత్ర విచిత్రమైన డ్రెస్‌లతో కనిపిస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. అంతేకాదు, విభిన్నమైన స్టైల్స్‌ను ఫాలో అవుతూ ఫ్యాషన్ ఐకాన్ అనిపించుకుంటోంది. తద్వారా తనను ఎంతో మంది ఫాలో అయ్యేలా చేసుకుంటూ దూసుకుపోతోంది.

అందులో యమా బిజీనే
గ్లామర్ ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సీరియళ్లు, షోలు చేస్తూ కెరీర్ పరంగా గ్యాప్ లేకుండా దూసుకుపోతోన్నా.. ఉర్ఫీ జావేద్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో తెగ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన రేంజ్‌ను పెంచుకుంటోంది.
గ్లామర్ షోకు చిరునామా
కెరీర్ ఆరంభంలో చాలా కాలం పాటు పద్దతిగానే కనిపించిన ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియాలో మాత్రం యమా హాట్ షో చేస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును యమా రెచ్చగొడుతోంది. ఈ మధ్య మరింతగా డోస్ పెంచేసి తన కొత్త కొత్త హాట్ డ్రెస్‌లు, ఫొటోషూట్లతో సంచలనంగా మారుతోంది.

గుండుతో ఉర్ఫీ ఫోజులు
సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ షాకింగ్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు గుండుతో దర్శనమిచ్చింది. దీంతో ఇది చూసిన వెంటనే నిజమే అని అంతా అనుకుంటున్నారు. కానీ, అది ఎడిటింగ్ చేసినట్లుగా పక్కన ఉన్న జుట్టును చూస్తే అర్థం అవుతోంది. మొత్తానికి ఉర్ఫీ షేర్ చేసిన ఈ పిక్2కు భారీ రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











