బిగ్ బాస్ బ్యూటీ అందాల సునామీ: అవన్నీ ఒక ఎత్తు.. ఈ వీడియో ఒక ఎత్తు
సోషల్ మీడియా వల్ల ఎంతో మంది లేడీస్ నేషనల్ రేంజ్‌లో సెన్సేషన్‌గా మారుతున్నారు. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు ఆఫర్లను భారీ స్థాయిలో దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో హాట్ బాంబ్ ఉర్ఫీ జావేద్ ఒకరు. చాలా ఏళ్ల క్రితమే సీరియల్ నటిగా ఫేమస్ అయిన ఈ చిన్నది.. బిగ్ బాస్ ఎంట్రీతో క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉర్ఫీ జావేద్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ బోల్డు వీడియోను వదిలింది. దానిపై మీరే లుక్కేయండి!
సీరియల్ నటిగా పాపులారిటీ: నటనపై మక్కువతో ఉర్ఫీ జావేద్.. చదువు పూర్తైన వెంటనే సోనీ టీవీలో ప్రసారం అయిన 'బడే భయ్యా కి దుల్హానియా' అనే సీరియల్ ద్వారా నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత 'చంద్ర నందిని', 'మేరీ దుర్గా', 'జేపన్నా', 'దయాన్', 'యే రిష్తా క్యా కెహ్లతా హై' వంటి ధారావాహికల్లో నటించి దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది.

బిగ్ బాస్ వల్ల క్రేజ్ రెట్టింపు: వరుస పెట్టి సీరియళ్ల మీద సీరియళ్లు చేస్తూ.. కెరీర్ పరంగా దూసుకుపోతోన్న సమయంలోనే ఉర్ఫీ జావేద్ హిందీలో ప్రసారం అయిన 'బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్'లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. ఇందులో తక్కువ రోజులే ఉన్నా తనదైన రీతిలో ఆడియెన్స్‌ను మెప్పించంది. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుని మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంది.

వివాదాలతో సావాసం చేస్తూ: కెరీర్ పరంగా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగుతోన్న ఉర్ఫీ జావేద్.. వ్యక్తిగత జీవితంలో మాత్రం కష్టనష్టాలను అనుభవించింది. ముఖ్యంగా 2018లో తన బాయ్‌ఫ్రెండ్ పరాస్ కల్నావత్‌కు బ్రేకప్ చెప్పి ఇబ్బంది పడింది. అలాగే, ఇస్లాం మతం గురించి వివాదాస్పద కామెంట్లు.. లైంగిక వేధింపుల గురించి మాట్లాడడం వంటి వాటిలో వివాదాల్లో చిక్కుకుంది.

ఫ్యాషన్‌కు సరికొత్త అర్థాలు: ఉర్ఫీ జావేద్ అంటే అందరూ గుర్తు పట్టడానికి ఆమె ఫాలో అయ్యే ఫ్యాషనే కారణం అని చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ చిన్నది చిత్ర విచిత్రమైన డ్రెస్‌లతో కనిపిస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. అంతేకాదు, విభిన్నమైన స్టైల్స్‌ను ఫాలో అవుతూ ఫ్యాషన్ ఐకాన్‌లా మారిపోయింది. దీంతో ఉర్ఫీ రేంజ్ మరింతగా పెరగడంతో పాటు ఎంతో మంది ఫాలో అయ్యే పరిస్థితి ఏర్పడింది.

సోషల్ మీడియాలో బిజీగా: కెరీర్ ఆరంభం నుంచీ సీరియళ్లు, షోలు చేస్తూ గ్యాప్ లేకుండా దూసుకుపోతోన్నా.. ఉర్ఫీ జావేద్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడంతో పాటు క్రేజ్ పెంచుకుంటోంది.

అస్సలు దాచుకోకుండానే: మొదట్లో చాలా కాలం పాటు డీసెంట్‌గా కనిపించిన ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియాలో మాత్రం మితిమీరన హాట్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ ఫైర్ పుట్టిస్తోంది. ఈ మధ్య మరింతగా డోస్ పెంచేసిన ఉర్ఫీ జావేద్.. తన కొత్త కొత్త హాట్ డ్రెస్‌లు ధరించిన ఫొటోషూట్లు, వీడియోలతో సెన్సేషన్‌గా మారుతోంది.
మంట పెడుతున్న వీడియో: హాట్ సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ బోల్డు వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బట్టలు మొత్తం విప్పేసి కనిపించింది. అయితే, టాప్ పార్ట్‌లకు చేతులను అడ్డుగా పెట్టుకుని బాడీ మొత్తం కనిపించేలా ఘాటుగా ఫోజులిచ్చింది. ఇక, ఇందులో 'టెస్ట్ పూర్తైంది' అనే స్టాంప్‌ను బాడీపై వేసుకుంది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











