నీ బాడీ కౌంట్ ఎంత.. బిగ్ బాస్ బ్యూటీతో 15 ఏళ్ల కుర్రాడు అసభ్యంగా!
సోషల్ మీడియాలో సినీ రంగానికి సంబంధించి చాలా మంది హీరోయిన్లు తమదైన రీతిలో హల్చల్ చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే బోల్డుగా ప్రవర్తిస్తూ దేశ వ్యాప్తంగా సెన్సేషన్‌గా మారుతున్నారు. అలాంటి వారిలో ఉర్ఫీ జావేద్ ఒకరు. అప్పుడెప్పుడో నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ భామ.. సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలతోనే సంచలనం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఉర్ఫీ జావేద్ ఓ చేదు అనుభవం గురించి బయటపెట్టింది. దానికి సంబంధించిన వివరాలను మీరే చూడండి!
సీరియల్ నటిగా ఫేమస్
ఉత్తరప్రదేశ్‌లోని ఇస్లాం కుటుండానికి చెందిన ఉర్ఫీ జావేద్.. చదువు పూర్తైన వెంటనే సోనీ టీవీలో ప్రసారం అయిన 'బడే భయ్యా కి దుల్హానియా' అనే సీరియల్ ద్వారా నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత 'చంద్ర నందిని', 'మేరీ దుర్గా', 'జేపన్నా', 'దయాన్', 'యే రిష్తా క్యా కెహ్లతా హై' వంటి ధారావాహికల్లో నటించి ఓ రేంజ్‌లో ఫేమస్ అయిపోయింది.

బిగ్ బాస్ షోతో మరింత
వరుసగా సీరియళ్ల మీద సీరియళ్లు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోన్న ఉర్ఫీ జావేద్.. హిందీలో ప్రసారం అయిన 'బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్'లో కంటెస్టెంట్‌గా ఎంటరైంది. ఎన్నో అంచనాలతో ఇందులోకి ఎంట్రీ ఇచ్చినా.. తక్కువ రోజులకే ఎలిమినేట్ అయింది. అయినా ఉర్ఫీ తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అప్పటి నుంచి మరింతగా హల్చల్ చేస్తూనే వెళ్తోంది.
వివాదాలు, ఎఫైర్లతోనూ
సీరియళ్ల వల్ల ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న ఉర్ఫీ జావేద్.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ముఖ్యంగా 2018లో తన బాయ్‌ఫ్రెండ్ పరాస్ కల్నావత్‌కు బ్రేకప్ చెప్పింది. అలాగే, ఇస్లాం మతం గురించి వివాదాస్పద కామెంట్లు చేయడం.. లైంగిక వేధింపుల గురించి మాట్లాడడం వంటి వాటిలో ఎన్నో కాంట్రవర్శీలతో సెన్సేషన్‌గా మారుతోంది.

సరికొత్త ఫ్యాషన్ ఐకాన్
ఉర్ఫీ జావేద్ పేరు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవడానికి ఆమె ఫాలో అయ్యే ఫ్యాషనే ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ చిన్నది చిత్ర విచిత్రమైన డ్రెస్‌లతో కనిపిస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. అంతేకాదు, విభిన్నమైన స్టైల్స్‌ను ఫాలో అవుతూ ఫ్యాషన్ ఐకాన్ అనిపించుకుంటోంది. తద్వారా తనను ఎంతో మంది ఫాలో అయ్యేలా ముందుకు సాగుతోంది.
నీ బాడీ కౌంట్ ఎంతని
తనదైన విచిత్రమైన డ్రెస్సింగ్, ప్రవర్తనతో తరచుగా దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోన్న బోల్డు బ్యూటీ ఉర్ఫీ జావేద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా ఇటీవలే ఆమెకు ఎదురైన ఓ చేదు సంఘటన గురించి ఆమె బయటపెట్టింది. ఈ సందర్భంలో ఉర్ఫీ జావేద్ 'ఇటీవలే ఓ టీనేజర్ నన్ను నీ బాడీ కౌంట్ ఎంత అని ప్రశ్నించాడు' అంటూ చెప్పుకొచ్చింది.

అది నేర్పించడంటూ
ఉర్ఫీ జావేద్ కంటిన్యూ చేస్తూ.. 'ఆ అబ్బాయికి దాదాపు 15 ఏళ్లు కూడా లేవు. కానీ, నా కుటుంబం, తల్లి ముందు అలా అడిగడంతో నేను షాక్ అయిపోయా. ఆ అబ్బాయిని అందరి ముందు లాగిపెట్టి కొట్టాలి అనుకున్నాను. కానీ, నేను ఈ అబ్బాయి తల్లిదండ్రుల పట్ల జాలిపడుతున్నాను. స్త్రీలను, ప్రజలందరినీ గౌరవించడం మీ అబ్బాయిలకు నేర్పండి' అని వెల్లడించింది.


Click it and Unblock the Notifications











