మోసపోయిన స్టార్ హీరోయిన్ .. నమ్మించి గొంతు కోశాడంటూ షాకింగ్ పోస్ట్
విచిత్రమైన డ్రెస్సింగ్ స్టైల్‌తో , హాట్ హాట్ ఫోటోలు, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు బాలీవుడ్ హాట్ బాంబ్ ఉర్పీ జావెద్. అందరికీ భిన్నంగా ఆలోచించడమే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. అందరిలా కాకుండా రకరకాల వస్తువులతో డ్రెస్సులు డిజైన్ చేయించుకుని అందాల ఆరబోతతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది ఉర్ఫి. ఈమె లైఫ్ స్టైల్ కూడా మిగిలిన స్టార్స్ మాదిరిలా కాకుండా డిఫరెంట్‌గా ఉంటుంది. బిగ్‌బాస్ షోలో తన మైండ్ గేమ్, గ్లామర్ షోతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని , ఇంటిల్లిపాదికి చేరువైంది.
కొద్దిరోజుల క్రితం బాగా కమిలిపోయిన ముఖంతో ఆమె పెట్టిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. అవి చూసిన నెటిజన్లు .. ఉర్ఫీకి ఏమైంది, ఏదైనా వ్యాధి బారినపడిందా అంటూ భయపడ్డారు. ఆ కాసేపటికే తనకు ఎదురైన సమస్యను పంచుకుంది. తాను ఫిల్లర్స్‌ను అధికంగా వాడినందున ఇలా తన మొహం బాగా కమిలిపోయినట్లుగా తయారైందని ఉర్ఫీ చెప్పుకుని తనలా చేసి సమస్యల్లో ఇరుక్కోవద్దని సూచించింది. ప్రతిరోజు తాను ఇదే సమస్యతో నిద్ర లేస్తానని .. ఈ సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పుకుని బాధపడింది

ఇక గతేడాది ఉర్ఫీ చీర కట్టుకుని ఓ ప్రోగ్రామ్‌కి వచ్చింది. నడుము, తొడలు కనిపించేలా ఆ చీర ఉండగా.. అండర్ వేర్ ఏమైంది, చీరను అవమానించావంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. తర్వాత హీరోయిన్ సమంత, తాను స్నేహితులమని చెప్పి బాంబు పేల్చింది. సమంతకు తన వీడియో గనుక నచ్చితే.. తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తుందని పేర్కొంది. గడిచిన మూడేళ్లుగా తాను సెక్స్‌కు దూరంగా ఉంటున్నానని.. ఈ కాలంలో కనీసం తాను ఎవరిని ముద్దు కూడా పెట్టుకోలేదని, రొమాంటిక్‌గానూ మాట్లాడలేదని బోల్ట్ కామెంట్స్ చేసింది.
ఇక రెండ్రోజుల క్రితం రాజస్థాన్‌లోని ప్రఖ్యాత కనకోలార్ కొండపై ఉన్న శివుడి ఆలయాన్ని దర్శించుకున్నారు ఉర్ఫీ జావెద్. అది కూడా ఏకంగా 400 మెట్లు ఎక్కి శివనామస్మరణ చేస్తూ శివయ్యని దర్శించింది. ఎప్పుడూ హాట్ కామెంట్స్ చేయడమే కాదు .. తనలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉందని ఉర్ఫీ జావెద్ నిరూపించుకున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తనకు నచ్చినట్లుగా ఉంటూ కోట్లాది రూపాయల ఆస్తుల్ని వెనకేశారు ఉర్ఫీ. అలాంటి ఈ హాట్ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
సొంతంగా బ్రాండ్ ప్రారంభించాలని ఉర్ఫీ భావించారు. దీనికి సంబంధించిన పెట్టుబడి, ఇతర ఏర్పాట్లు కూడా ఆమె చేసుకుంటైనే ఓ సహ వ్యవస్ధాపకుడిని కూడా ఎంచుకున్నారు. ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా పూర్తి చేసి అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో బోర్డ్ నిబంధనల పేరు చెప్పి అతని కో ఫౌండర్‌గా తప్పుకున్నాడని ఉర్ఫీ జావెద్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాండ్ ఏర్పాటు చేసుకోలేకపోయానని.. ఇబ్బందుల్లో ఉన్నానని, ఇకపై నా ప్రయాణం ఎటు వైపు వెళ్తుందో తెలియదంటూ ఉర్ఫీ జావెద్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం మేం అండగా ఉంటామని కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











